Yuzvendra Chahal : ప్రీతి జింటా టాప్-2 ఆశలకు యుజ్వేంద్ర చాహల్ బ్రేక్

Yuzvendra Chahal : ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు అంచనాలకు మించి రాణిస్తూ 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్లేఆఫ్‌లకు చేరుకుంది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వారిలో స్పిన్ మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్ ముందుంటాడు. ఇప్పుడు పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జింటాకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. ముంబై ఇండియన్స్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు చాహల్ దూరం అయ్యే ఛాన్స్ ఉంది. చాహల్‌కు అయిన గాయం ప్రీతి జింటా కలలను దెబ్బ తీసేలా ఉంది.
యుజ్వేంద్ర చాహల్ కేవలం ఒక బౌలర్ కాదు, అతను మ్యాచ్ విన్నర్. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడిగా చాహల్ పేరు తెచ్చుకున్నాడు. అతని వికెట్ తీసే సత్తా, కీలక సమయాల్లో మ్యాచ్‌ను మలుపు తిప్పే నైపుణ్యం పంజాబ్‌కు ఎంతో అవసరం. అయితే, చాహల్‌కు మణికట్టు గాయం (wrist injury) అయ్యింది. ఈ గాయం కారణంగా అతను గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడలేకపోయాడు.
తాజా సమాచారం (ESPNcricinfo ప్రకారం) ప్రకారం.. ముంబై ఇండియన్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు కూడా చాహల్ దూరం కావచ్చని భావిస్తున్నారు. అయితే, ప్లేఆఫ్‌లకు అతను అందుబాటులో ఉంటాడని పంజాబ్ కింగ్స్ ఆశిస్తోంది.
Read Also:Lost your Aadhaar card: ఆధార్ కార్డు పోయిందా.. ఇక నో టెన్షన్
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో గత మ్యాచ్ ఓడిన తర్వాత, పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా, తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నారు. దీనికి కారణం పంజాబ్ కింగ్స్‌ను టాప్-2 స్థానంలో నిలపడం. టాప్-2లో ఉంటే, ఫైనల్ టిక్కెట్ పొందడానికి రెండు అవకాశాలు లభిస్తాయి. కానీ, చాహల్ గాయం ఇప్పుడు ప్రీతి జింటా లక్ష్యానికి పెద్ద షాక్ తగిలింది. ఐపీఎల్ చరిత్రలో చాహల్ అత్యంత కీలకమైన బౌలర్. పంజాబ్ కింగ్స్ జట్టుకు అతని అవసరం చాలా ఉంది. ఒకవేళ అతను ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు దూరమైతే అది హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌కు ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ముంబై కూడా టాప్-2లోకి వెళ్లాలని చూస్తున్నందున, చాహల్ లేకపోవడం వారికి కలిసిరావచ్చు.
Read Also:IPL 2025 : ఐపీఎల్ చరిత్రలో కొత్త అధ్యాయం.. వైభవ్ సూర్యవంశీ రికార్డును సేవ్ చేసిన క్లాసెన్!
ఐపీఎల్ 2025లో యుజ్వేంద్ర చాహల్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. అతను పంజాబ్ కింగ్స్ తరపున ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్‌పై సాధించిన హ్యాట్రిక్ కూడా ఉంది. పంజాబ్ కింగ్స్ 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్లేఆఫ్‌లకు చేరుకోవడంలో చాహల్ కీలక పాత్ర పోషించాడు. అయితే, వారి ప్రయాణం ఇంకా ముగియలేదు. ప్లేఆఫ్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యేలోపు చాహల్ పూర్తి ఫిట్నెస్ సాధించడం పంజాబ్ కింగ్స్‌కు చాలా అవసరం.
-
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!
-
IPL 2025 Final: రిజర్డ్వ్ డే రోజు వర్షం పడితే.. విన్నర్ ఇక ఆ జట్టే!
-
IPL 2025 : ఫైనల్లో ‘ముస్తాక్ అలీ ట్రోఫీ’ రిపీట్ అవుతుందా? అయ్యర్ కాన్ఫిడెన్స్ నిజమవుతుందా ?
-
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్‌కు భారీ భద్రత.. షాక్ కొడుతున్న టికెట్ రేట్లు
-
IPL 2025 : ఐపీఎల్ ఫైనల్ కు వరుణ గండం.. మోదీ పిచ్ ఎవరికీ కలిసొస్తుంది ?
-
IPL 2025: ఫైనల్‌కు వెళ్లిన సంతోషమే లేదు.. శ్రేయస్ అయ్యర్‌కు బిగ్ షాక్