Court Collection: వర్కింగ్ డే లో కూడా బీభత్సమే..’కోర్ట్’ 4 రోజుల వసూళ్లు ఎంతంటే!

Court Collection:
నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాతగా వ్యవహరించిన లేటెస్ట్ చిత్రం ‘కోర్ట్'(court movie) బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందే ఈ సినిమా పాటల ద్వారా, ట్రైలర్ ద్వారా ప్రేక్షకుల నుండి అటెన్షన్ ని సంపాదించింది. నటీనటులు కొత్త వారు అయినప్పటికీ, ఆసక్తిగానే స్టోరీ లైన్ ఉందని, కచ్చితంగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడాలని ఫిక్స్ అయ్యారు. వాటికి తోడు ఓపెనింగ్స్ కి నాని స్టార్ ఇమేజ్ కూడా ఈ సినిమాకి బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ‘కోర్ట్ తో పాటు హిట్ 3 చిత్రానికి కూడా నేనే నిర్మాత. కోర్ట్ కంటే మూడు రెట్లు డబ్బు అక్కడ ఎక్కువ ఖర్చు చేశాను. నేను చెప్పినట్టుగా కోర్ట్ చిత్రం లేకపోతే నా ‘హిట్ 3′ చిత్రాన్ని ఎవరూ చూడొద్దు’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై బలమైన ప్రభావం చూపించింది.
ఇకపోతే మొదటి మూడు రోజులు ఈ చిత్రానికి 23 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ అయితే దాదాపుగా 12 కోట్ల రూపాయిలు వచ్చిందట. కేవలం 7 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న సినిమాకు మూడు రోజుల్లో 5 కోట్ల రూపాయిల లాభం రావడమంటే చిన్న విషయం కాదు. వీకెండ్ కదా, సినిమాకు టాక్ కూడా బాగుంది. ఆ మాత్రం రావడం లో గొప్పేమి ఉంది లేకపోవచ్చు. కానీ నాల్గవ రోజు వర్కింగ్ డే. ఆరోజున వచ్చే వసూళ్లు అత్యంత కీలకం. కోర్ట్ చిత్రం ఆరోజున కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టిందని. నాల్గవ రోజున ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, రెండు కోట్ల 20 లక్షలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.
మొత్తం మీద నాలుగు రోజులకు ఈ చిత్రానికి 14 కోట్ల 22 లక్షల రూపాయిల షేర్, 28 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే నైజాం ప్రాంతం లో 5 కోట్ల 30 లక్షలు, సీడెడ్ లో 32 లక్షలు రాబట్టింది. ఊపు చూస్తుంటే వరల్డ్ వైడ్ జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ 7 కోట్లను కేవలం నైజాం ప్రాంతం నుండి రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగు కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ లో 3 కోట్ల 20 లక్షలు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా లో కోటి 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
-
Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్‌డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
Peddi Movie First Glimpse: వచ్చేసిన పెద్ది గ్లింప్స్.. మొత్తానికి ఆ షాట్ మాత్రం హైలెట్
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
-
Craze Heroine: హీరోయిన్ గా ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం కలెక్టర్ గా విధులను నిర్వహిస్తుంది.. ఎవరో తెలుసా..
-
Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్ కు జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసిన అట్లీ…అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా