Dil raju brother siresh: మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు సోదరుడు శిరీష్ సారీ.. కారణమిదే!

Dil raju brother siresh: హీరో రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మీద వచ్చిన ఈ మూవీ సంక్రాంతి పండుగ కానుకగా వచ్చి ప్లాప్ అయింది. అయితే ఈ సినిమా ప్లాప్ పై నిర్మాత దిల్ రాజు సోదరుడు, శిరీష్ ఇంటర్వ్యూలో కొన్ని వివాద స్పదా వ్యాఖ్యలు చేశారు. ఇవి తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మొత్తం సోషల్ మీడియను హల్చల్ చేశాయి. గేమ్ చేంజింగ్ మూవీ ఫ్లాప్ అయితే కనీసం నిర్మాతలను కూడా పట్టించుకోలేదని దిల్ రాజు సోదరులు శిరీష్ అన్నాడు. దీంతో ఓ ఇంటర్వ్యూ లో దీనిపై క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్ అభిమానులకి సారీ చెప్పారు. ఆ మాటలు ఎందుకు అన్నారో, వాటి గురించి పూర్తి వివరణ ఇచ్చారు.
శిరీష్ ఇటీవల మాట్లాడుతూ.. నేను ఒక ఇంటర్వ్యలో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఇవి కాస్త నెగెటివ్ గా అయ్యాయి. నేను అన్న మాటలు ఫ్యాన్స్ ను హర్ట్ చేశాయని క్షమాపణలు అడిగారు. తన మాటలు ఎంత బాధపెట్టాయో అని అన్నారు. RRR వంటి సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తమని నమ్మి గేమ్ చేంజర్ మూవీకి ఒప్పుకున్నారని అన్నారు. వేరే సినిమాలకి ఒకే చెప్పకుండా తమ సినిమాలకి ఒకే చెప్పారని అన్నారు. మెగాస్టార్ ఫ్యామిలీ తో తమకు ఎంతో అనుబంధం ఉందని అన్నారు. ఇలా హీరోల వాల్యూ ను తగ్గించేలా మాట్లాడటం తప్పు అని, ఇంకా ఎప్పుడు ఇలా చేయమని అన్నారు. తాను అన్న మాటలు హార్ట్ చేసి ఉంటే నన్ను క్షమించండి అంటూ సోషల్ మీడియాలో ఒక లీకను విడుదల చేసి శిరీష్ తెలిపాడు. ప్రస్తుతం ఈ లేక సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవుతుంది.
కొంతమంది క్షమాపణ లైట్ తీసుకోగా, మరికొందరు క్షమాపణపై మండిపడుతున్నారు. అనాల్సిన అన్ని మాటలు అనేసి రామ్ చరణ్ పరువు తీసేసి ఇప్పుడు మళ్ళీ క్షమాపణ చెప్పడం ఏంటని అంటున్నారు. చాలా తెలివిగా తప్పించుకున్నారని అంటున్నారు. ఫ్యూచర్ లో దిల్ రాజు బ్యానర్ లో రామ్ చరణ్ మళ్లీ సినిమా తీయకూడదని అంటున్నారు. అయితే దీనిపై రామ్ చరణ్ ఇంకా స్పందించలేదు. దీన్ని రామ్ చరణ్ సీరియస్ గా తీసుకుంటే మాత్రం మళ్లీ అటువైపు వెళ్లారని అంటున్నారు. మరి దీనిపై రామ్ చరణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Also read: Pawan Kalyan : హరిహర వీరమల్లు పూర్తి చేసింది త్రివిక్రమ్.. పవన్ కోసం హెల్ప్.. వీడియో లీక్