Mega family: గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్, లావణ్య.. మెగా ఫ్యామిలీలోకి మరో హీరో!
మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2023లో కుటుంబ సభ్యులు సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే వీరు ఇప్పుడు గుడ్ న్యూస్ తెలిపారు. ఇద్దరుగా ఉన్న కాస్త ఇప్పుడు ముగ్గురు అవుతున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు అవుతున్నామని లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

Mega family: మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2023లో కుటుంబ సభ్యులు సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే వీరు ఇప్పుడు గుడ్ న్యూస్ తెలిపారు. ఇద్దరుగా ఉన్న కాస్త ఇప్పుడు ముగ్గురు అవుతున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు అవుతున్నామని లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. లావణ్య, వరుణ్ చేతులు పట్టుకుని, వీరితో పాటు చిన్న పిల్లల షూ ఉన్న ఫొటో పెట్టారు. దీంతో తల్లిదండ్రులం కాబోతున్న విషయాన్ని వెల్లడించారు. ఇక మెగా ఫ్యామిలీలోకి త్వరలోనే ప్రిన్స్ లేదా ప్రిన్సెస్ రాబోతుందని నెటిజన్లు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదే పోస్ట్‌ను వరుణ్ తేజ్ కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు విషెష్ తెలియజేస్తున్నారు. లావణ్య, వరుణ్ తేజ్‌కి ఇటీవల వివాహం జరిగింది. దాదాపుగా ఏడాదిపైనే అవుతుంది. ఇంతలోనే వీరు గుడ్ న్యూస్ తెలిపారు. మరి వీరికి మెగా వారసుడు లేకపోతే వారసురాలు పుడుతుందో చూడాలి. ఇటీవల రామ్ చరణ్, ఉపాసన దంపతులకు వారసురాలు పుట్టింది. వీరికి పెళ్లి అయి దాదాపుగా 11 ఏళ్లు అయిన తర్వాత క్లింకారా పుట్టింది. అయితే ఇంకొన్ని రోజుల్లో పాపకు రెండేళ్లు పూర్తి అవుతాయి.
Read Also: పెళ్లయిన తర్వాత విడాకులకు కారణాలు ఇవేనా?
ఇదిలా ఉండగా లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ 2017లో మిస్టర్ సినిమా ద్వారా మొదటిసారి కలుసుకున్నారు. ఈ సినిమా తర్వాత మళ్లీ వారు 2018లో అంతరిక్షం 9000 KMPH మూవీలో కూడా వర్క్ చేశారు. ఈ సినిమా సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. అయితే వీరు ప్రేమలో ఉన్న విషయాన్ని దాచిపెట్టారు. దాదాపుగా 2023 వరకు కూడా ఈ విషయాన్ని అలాగే దాచి పెట్టారు. వీరిద్దరూ లవ్‌లో ఉన్నారని రూమర్స్ వచ్చినా కూడా పట్టించుకోలేదు. లావణ్య, వరుణ్ కూడా వీటిని కొట్టి పారేశారు. చివరకు 2023లో వీరు ఎంగేజ్‌మేంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. 2023 జూన్ 8న హైదరాబాదులో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక తర్వాత ఏడాది కాకుండా అదే ఏడాది 2023లో నవంబర్ 1న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అయితే వీరి వివాహం తర్వాత లావణ్య సినిమాలు చేయదని, అందరూ భావించారు. కానీ తర్వాత ఓ ఓటీటీ ఫిల్మ్ చేసింది. ఇటీవల మరో సినిమాకు కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. పెళ్లి అయిన ఏడాది తర్వాత ఇలా ప్రెగ్నెంట్ కావడంతో ఇప్పుడు కాస్త సినిమాలకు బ్రేక్ పడవచ్చు. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీలోకి మరో ప్రిన్స్ లేదా ప్రిన్సెస్ రాబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. దీంతో సినీ సెలబ్రిటీలు, అభిమానులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Read Also: సినిమాలపై ట్రంప్ భారీ టారిఫ్.. ఇకపై రిలీజ్‌లు కష్టమే
-
Cooking Oil: ఈ నూనెలు వంటల్లో ఉపయోగిస్తున్నారా.. అంతే సంగతులు ఇక
-
CIBIL Score: పెళ్లికి ముందు సిబిల్ స్కోర్ తప్పనిసరిగా చెక్ చేయాలా?
-
Financial Problems: ఈ దిశలో బీరువా పెడితే.. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
-
Aadhaar card: ఆధార్ కార్డు విషయంలో ఈ మిస్టేక్స్ చేస్తే.. జైలు శిక్ష తప్పదు
-
Milk to Your Children: నిద్రపోయే ముందు పిల్లలకు పాలు తాగిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త
-
WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వెబ్‌లో అద్భుతమైన ఫీచర్లు