Crazy Tollywood Heroine: ఎంబీబీఎస్ ఎగ్జామ్ కోసం మిస్ ఇండియా పోటీ నుంచి తప్పుకున్న ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా…
Crazy Tollywood Heroine 2022లో శివాని రాజశేఖర్ కు ఒక గోల్డెన్ అవకాశం వచ్చింది. ప్రతిష్టాత్మక సెమినా మిస్ ఇండియా పోటీలలో పాల్గొని అవకాశం శివానికి లభించింది. ఆమె కూడా ఈ అందాల పోటీలలో పాల్గొంటున్నట్లు చాలా సంతోషంగా ప్రకటించింది.

Crazy Tollywood Heroine: మనదేశంలో అందాల పోటీలకు మిస్ ఇండియా కాంటెస్ట్ ను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. చాలామంది అందులో పాల్గొనాలని, విజేతగా నిలవాలని కలలు కంటారు. కానీ మనం చెప్పుకోబోయే ఈ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం తన మెడిసిన్ థియరీ ఎగ్జామ్ కోసం మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకుంది. ఈ హీరోయిన్ ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రముఖ నటులు. తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే నడుస్తూ ఈమె కూడా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమె ఓకే చెప్పినా మొదటి రెండు సినిమాలు మధ్యలో ఆగిపోయాయి. దాంతో ఆమెను అందరూ ఐరన్ లెగ్ అంటారేమో అనే భయంతో సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే డిప్రెషన్ లోకి వెళ్ళింది. సినిమా ఇండస్ట్రీలో చాలా అనుభవం ఉన్న తన తల్లిదండ్రుల సూచనలతో ఆమె క్రమంగా డిప్రెషన్ నుంచి బయటపడింది. మళ్లీ హీరోయిన్ గా తన ప్రయత్నాలను మొదలుపెట్టింది. వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందం, అభినయంతో ప్రశంసలు అందుకుంది. తెలుగుతోపాటు తమిళ్ సినిమా ప్రేక్షకులను కూడా అలరించింది. ఈ హీరోయిన్ మెడిసిన్ చదువు పూర్తి చేసింది. నటిగా కంటే కూడా డాక్టర్ గా మారడం తన మొదటి లక్ష్యం అంటుంది. అందుకే ఈ ముద్దుగుమ్మ ప్రతిష్టాత్మక మిస్ ఇండియా పోటీల నుంచి కూడా తప్పుకుంది.ఈమె మరెవరో కాదు సీనియర్ హీరో రాజశేఖర్ దంపతుల కూతురు శివాని రాజశేఖర్. తాజాగా శివానీకి మాధవన్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇది ఒక పాన్ ఇండియా సినిమా. ఈ క్రమంలో శివాని రాజశేఖర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
2022లో శివాని రాజశేఖర్ కు ఒక గోల్డెన్ అవకాశం వచ్చింది. ప్రతిష్టాత్మక సెమినా మిస్ ఇండియా పోటీలలో పాల్గొని అవకాశం శివానికి లభించింది. ఆమె కూడా ఈ అందాల పోటీలలో పాల్గొంటున్నట్లు చాలా సంతోషంగా ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే సడన్గా ఈ పోటీలో నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసింది. శివాని ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొనే రోజున ఆమె మెడికల్ థియరీ ఎగ్జామ్ ఉండడంతో ఆమె అందాల పోటీలో పాల్గొనలేకపోతున్నట్లు తన ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.
తన జీవితంలో సెమినా మిస్ ఇండియా కంటే కూడా డాక్టర్ కావాలనేదే తన కోరిక అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది శివాని రాజశేఖర్. అయితే శివాని రాజశేఖర్ తండ్రి రాజశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజశేఖర్ ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆయన తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.
View this post on Instagram
-
The Paradise Interesting Update: ది ప్యారడైజ్ గురించి ఆసక్తికర అప్డెట్
-
Rajasaab Run Time: రాజాసాబ్ రన్ టైమ్ ఎంతంటే
-
Samantha Finger Ring: సమంత వేలికి కనిపించిన స్పెషల్ రింగ్.. సోషల్ మీడియాలో వైరల్
-
Kingdom Movie Collection: కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
-
Abbas Re Entry: పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న అబ్బాస్
-
Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని