Craze Heroine: హీరోయిన్ గా ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం కలెక్టర్ గా విధులను నిర్వహిస్తుంది.. ఎవరో తెలుసా..
Craze Heroine అతి తక్కువ సమయంలోనే సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు యూపీఎస్సీ పాస్ అయ్యి కలెక్టర్గా తన విధులను నిర్వహిస్తుంది.

Craze Heroine: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలంటే అంత సులభమైన పని కాదు. ఇప్పటివరకు సినిమా రంగంలో చాలా మంది ముద్దుగుమ్మలు తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అతి తక్కువ సమయంలోనే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఈ హీరోయిన్ కూడా అతి తక్కువ సమయంలోనే సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు యూపీఎస్సీ పాస్ అయ్యి కలెక్టర్గా తన విధులను నిర్వహిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసేది. చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అలాగే బుల్లితెర మీద కూడా 48 షోలలో పాల్గొని సందడి చేసింది. సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా 32 సినిమాలలో నటించి ఈ హీరోయిన్ ఇప్పుడు కలెక్టర్గా విధులను నిర్వహిస్తుంది. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ప్రస్తుతం ఐఏఎస్ గా తన విధులను నిర్వహిస్తుంది. ఈ హీరోయిన్ మరెవరో కాదు హెచ్ ఎస్ కీర్తన. కీర్తన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని హోసకేరే గ్రామంలో జన్మించింది.తనకు నాలుగేళ్లు ఉన్న వయసులోనే కీర్తన సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కర్పూర్ దా గోబే అనే సినిమాతో కీర్తన సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఈమె దాదాపు 30 కి పైగా సినిమాలు అలాగే 40 కి పైగా టీవీ షోలో కనిపించి అలరించింది.
కీర్తన గంగా యమునా, హాబ్బా, లేడీ కమిషనర్, పుట్టని ఏజెంట్ వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. సినిమా ఇండస్ట్రీలో నటిగా కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే నటనకు గుడ్ బై చెప్పి సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యింది. కీర్తన 2011లో కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణురాలు అయింది. ఆ తర్వాత రెండేళ్లు అధికారిగా పనిచేసింది. తనకున్న ఆసక్తితో యూపీఎస్సీ ఐదు సార్లు రాసి యూపీఎస్సీ ఎగ్జామ్లో విఫలమైంది. చివరకు ఆరోసారి యూపీఎస్సీలో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది.
ఎగ్జామ్లో ఆమె 167 సాధించింది. మొదటిసారి కీర్తన కర్ణాటకలోని మాండ్య జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసింది. వెండి తెర మీద నటిగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే కీర్తన తన కోరిక వైపు అడుగులు వేసింది. ఐదుసార్లు ఫెయిల్యూర్ ఎదురైనా కూడా మళ్లీ ప్రయత్నిస్తూ చివరికి ఐఏఎస్ కావాలని తన కోరికను నెరవేర్చుకుంది. దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే ఎంత పెద్ద కళ అయినా కూడా సాధ్యమేనని కీర్తన ప్రయాణం రుజువు చేసింది.
-
The Paradise Interesting Update: ది ప్యారడైజ్ గురించి ఆసక్తికర అప్డెట్
-
Rajasaab Run Time: రాజాసాబ్ రన్ టైమ్ ఎంతంటే
-
Samantha Finger Ring: సమంత వేలికి కనిపించిన స్పెషల్ రింగ్.. సోషల్ మీడియాలో వైరల్
-
Kingdom Movie Collection: కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
-
Abbas Re Entry: పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న అబ్బాస్
-
Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని