Retro Collection: హిట్ 3 ఎఫెక్ట్.. సూర్య రెట్రో మూవీకి భారీగా తగ్గిన కలెక్షన్లు
Retro Collection కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. సినిమాలో పూజా హెగ్డే యాక్టింగ్ కూడా బాగుందని టాక్ వినిపిస్తోంది. కనిమా సాంగ్ అయితే మూవీ మొత్తానికి అదుర్స్ అంటున్నారు.

Retro Collection: తమిళ హీరో సూర్యకు టాలీవుడ్‌లో కూడా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో మంచి సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే సూర్యకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు. వరుసగా ఫ్లాప్‌ల పరంపర కొనసాగుతోంది. ఇటీవల రెట్రో మూవీతో సూర్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి రోజే పెద్దగా కలెక్షన్లు అందుకోలేకపోయింది. కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా మంచి హిట్ కూడా పొందలేకపోయింది. దీనికి తోడు హీరో నాని హిట్ 3 మూవీ కూడా రావడంతో.. రెట్రో మూవీ కలెక్షన్లపై భారీగా ప్రభావం పడింది. మొదటి రోజే కలెక్షన్లు భారీగా తగ్గాయి. హిట్ 3 మూవీ మంచి హిట్ టాక్ రావడంతో ఎక్కువ మంది దీనికే వెళ్లారు. బుకింగ్స్ కూడా హిట్ అసలు ఖాళీ లేవు. మొదటి రోజు సెలవు కావడంతో అన్ని థియేటర్లు కూడా ఫుల్ అయ్యాయి. నాని హిట్ మూవీ రూ.43 కోట్ల కలెక్షన్లు మొదటి రోజు రాబట్టగా.. రెట్రో మూవీ మాత్రం కేవలం రూ.16 కోట్లను రాబట్టింది. అయితే సినిమా మొదటి రోజు ప్రీమియర్స్ నుంచి నెగెటివ్ టాక్ రావడంతో రెట్రో ఓపెనింగ్స్‌పై భారీగా ప్రభావం పడింది. తమిళనాడుతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా పెద్దగా టాక్ తెచ్చుకోలేకపోయింది.
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. సినిమాలో పూజా హెగ్డే యాక్టింగ్ కూడా బాగుందని టాక్ వినిపిస్తోంది. కనిమా సాంగ్ అయితే మూవీ మొత్తానికి అదుర్స్ అంటున్నారు. వింటేజ్ లుక్‌లో పూజా బాగుంది. అయితే ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. పారి చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరం అవుతాడు. తిలక్ అనే గ్యాంగ్‌స్టర్ అతన్ని దత్తత తీసుకుంటాడు. సొంత కొడుకులానే తనని పెంచుకుంటాడు. పారి కూడా ఒక గ్యాంగ్‌స్టర్ అవుతాడు. అయితే పారికి పూజా హెగ్డేను ప్రేమిస్తాడు. రుక్మిణిని ప్రాణంగా ప్రేమించడంతో తన కోసం గ్యాంగ్‌స్టర్ లైఫ్‌ను వదిలేయడానికి రెడీ అవుతాడు. చివరకు రుక్మిణికి తెలియడంతో వదిలేసి వెళ్లిపోతుంది. అయితే ఈ క్రమంలో పారి తిలక్‌కు ఎదురు తిరుగుతాడు? దీనికి కారణం ఏంటి? పారి, రుక్మిణి పెళ్లిని కూడా తిలక్ అడ్డుకుంటాడు? అసలు దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటనేది మూవీ.
ఇదిలా ఉండగా.. రెట్రోకి పోటీగా వచ్చిన హిట్ 3 మూవీ మంచి కలెక్షన్లు రాబట్టింది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్లు కూడా భారీగా రాబట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో జోరు చూపించింది. అలాగే మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా రూ.43 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అయితే నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది. అయితే వీకెండ్‌లో ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. కేవలం వీకెండ్‌లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హిట్ మూవీలో హీరోగా విశ్వక్ సేన్ నటించగా.. హిట్ 2 లో అడవి శేష్ కనిపించాడు. ఈ రెండు సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలకు హీరో నాని నిర్మాతగా వ్యవహరించారు. అయితే హిట్ 3 మూవీ అయితే అదిరిపోయింది. సినిమా స్టోరీ కొత్తగా ఉంది. మొదటి నుంచి చివరి వరకు సినిమా నాని వన్ మ్యాన్ షో చేశాడు.
-
Mokshagna: మోక్షజ్ఞ సినిమాకు మోక్షం వచ్చిందా..? సెట్స్ మీదకి వెళ్ళేది అప్పుడేనా..?
-
Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్‌డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
Peddi Movie First Glimpse: వచ్చేసిన పెద్ది గ్లింప్స్.. మొత్తానికి ఆ షాట్ మాత్రం హైలెట్
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
-
Craze Heroine: హీరోయిన్ గా ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం కలెక్టర్ గా విధులను నిర్వహిస్తుంది.. ఎవరో తెలుసా..