SSC Exams : 10వ తరగతి పరీక్షలలో ‘పుష్ప’ మేనియా..’దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటర్’!

SSC Exams :
చిన్న పిల్లల మీద సినిమాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, చెడుని ప్రేరేపించే సినిమాలు స్టార్ హీరోలు చేయడం ఆపాలి అంటూ కొంతమంది ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. మొన్నీమధ్యనే ‘లక్కీ భాస్కర్'(Lucky Bhaskar) సినిమాని చూసి కొంతమంది స్కూల్ పిల్లలు ఆ సినిమాలో హీరోలాగా తయారు అవుదాం అని పారిపోయారు. ఇప్పుడు ‘పుష్ప'(Pushpa 2: The Rule) చిత్రం కూడా చిన్న పిల్లలపై అలాంటి ప్రభావం చూపిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా స్కూల్, ఇంటర్ చదివే వాళ్ళు ఈ పుష్ప క్యారక్టర్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు మాట్లాడే తీరు, ప్రవర్తన మొత్తం మారిపోయింది, ఈ సినిమాని చూసి మా స్కూల్ పిల్లలు మొత్తం చెడిపోయారు అంటూ కొద్దిరోజుల క్రితమే ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
రీసెంట్ గానే పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఎవరో ఒక విద్యార్థి స్కూల్ గోడపై ‘దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు..పట్టుకుంటే వదిలేస్తా బుక్లెట్..నీ యవ్వ తగ్గేదేలే’ అంటూ రాయడం సంచలనంగా మారింది. దానికి సంబంధించిన ఫోటో ని సోషల్ మీడియా లో షేర్ చేయగా, అది తెగ వైరల్ గా మారిపోయింది. ఈ ఫోటో ని చూసిన ప్రతీ ఒక్కరు పుష్ప చిత్రం పిల్లల్ని చెడగొట్టేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇలాంటి సినిమాలను అనుమతిస్తున్న సెన్సార్ బోర్డుని అనాలి ముందు. ఒకప్పుడు ఇలాంటి సినిమాల ప్రభావం పిల్లలపై పెద్దగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా గట్టిగా ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లల IQ చాలా గొప్పది. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రేంజ్ వీళ్లంతా. ఇలాంటి సినిమాలు వాళ్ళని చెడగొట్టేస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంటే, ఇక మీదట సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి.
యాంటీ హీరోల సినిమాలు నెమ్మదిగా తగ్గిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రీసెంట్ గానే హద్దులు దాటినా వయొలెన్స్ సన్నివేశాలతో తెరకెక్కిన ‘మార్కో'(Marco Movie) చిత్రం పై కూడా అనేక విమర్శలు వినిపించాయి. అసలు ఇలాంటి సినిమాని ఎలా సెన్సార్ బోర్డు అనుమతించింది అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు అనేకమంది విశ్లేషకులు. CBFC అయితే ఈ సినిమాని టీవీ టెలికాస్ట్ చేసేందుకు వీలు లేదని బ్యాన్ విధించింది. అంతే కాకుండా ఓటీటీ లో కూడా ఈ చిత్రాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర I & B మంత్రికి లేఖ కూడా రాసారు. రాబోయే రోజుల్లో ‘ఓజీ’ చిత్రం కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదురుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ‘పుష్ప 2’ ప్రభావమే యువతపై ఈ రేంజ్ లో ఉంటే, ‘పుష్ప 3’ కూడా ఉంటుందట. నిర్మాత ఈమధ్య ప్రకటించాడు. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలను బ్యాన్ చేస్తామంటూ సెన్సార్ బోర్డు ఆదేశాలు ఇస్తే ‘పుష్ప 3’ ఆగిపోవచ్చు.