Surya: దాదాపు 15 ఏళ్ల తర్వాత.. తెలుగు డైరెక్టర్‌తో సినిమాకు ఒకే చేసిన తమిళ స్టార్ సూర్య

Surya:
తమిళ స్టా్ర్ హీరో సూర్యకు ఫ్యాన్ బేస్ ఎక్కువే. కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా సూర్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. అక్కడ తీసిన సినిమాలే తెలుగులో డబ్బింగ్ చేస్తే మంచి హిట్‌ను సంపాదించుకున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో సూర్య డైరెక్ట్‌గా తెలుగు సినిమా చాలా ఏళ్ల కిందట చేశారు. ఎక్కువగా తెలుగు డబ్బింగ్ సినిమాలే చేస్తారు. కానీ 2010లో రక్త చరిత్ర 2 సినిమాను తెలుగులో చేశారు. మళ్లీ ఇప్పటి వరకు తెలుగులో ఒక్క సినిమా చేయలేదు. అన్ని కూడా డబ్బింగ్ సినిమాలే చేశారు. మళ్లీ ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగు దర్శకుడు అయినా వెంకీ అట్లూరితో సూర్య సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతేడాది లక్కీ భాస్కర్ సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించిన వెంకీ అట్లూరి ఇప్పుడు స్టార్ హీరోతో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి సూర్య సైన్ చేసినట్లు కూడా తెలుస్తోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమాకి సైన్ చేశారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాదే ప్రారంభంచనున్నట్లు తెలుస్తోంది. మేలో సినిమా షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లక్కీ భాస్కర్ మంచి హిట్ సంపాదించడంతో పాటు కలెక్షన్లు రాబట్టింది. అలాగే స్టోరీ కూడా బాగుండటంతో సినిమాకు వెంకీకి బాగా పేరు వచ్చింది. ఈ కారణంగానే సూర్య సినిమాకు వెంటనే ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాతో పాటు సూర్య తెలుగు సినిమాకి కూడా సూర్య ఒకే చేసినట్లు తెలుస్తోంది. తండేల్ మూవీతో హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో కూడా సూర్య సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించనున్నారు. అయితే దీనికి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా రెట్రో చిత్రంలో నటించారు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. ఇది తమిళం, తెలుగులోనూ విడుదల కానుంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం వేసవిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.