TEST Movie Review Telugu: టెస్ట్ మూవీ రివ్యూ.. మ్యాచ్ ఫిక్సింగ్ స్టోరీతో మెప్పించారా?
TEST Movie Review Telugu మాధవన్, నయనతార, సిద్ధార్థ్ కాంబోలో వచ్చిన సినిమా టెస్ట్. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకుండా డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది. ముఖ్య నటులు ఉన్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

TEST Movie Review Telugu: సినిమా: టెస్ట్
నటీనటులు: మాధవన్, నయనతార, సిద్దార్థ్, మీరా జాస్మిన్, వినయ్ వర్మ, కాళి వెంకట్, ఆడుగళం మురుగదాస్ తదితరులు
సంగీతం: శక్తి శ్రీ గోపాలన్
ఛాయాగ్రహణం: విరాజ్ సింగ్ గోహిల్
రచన: సుమన్ కుమార్-శశికాంత్
నిర్మాతలు: శశికాంత్-చక్రవర్తి రామచంద్ర
దర్శకత్వం: శశికాంత్
మాధవన్, నయనతార, సిద్ధార్థ్ కాంబోలో వచ్చిన సినిమా టెస్ట్. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకుండా డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది. ముఖ్య నటులు ఉన్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
అర్జున్ వెంకట్రామన్ (సిద్దార్థ్) భారత క్రికెట్ జట్టులో ఒక బ్యాటర్. అయితే జట్టుకు ఎన్నో విజయాలు అందించి.. గొప్ప ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే అనుకోకుండా అతని కెరీర్ ఇరకాటంలో పడింది. పాకిస్థాన్ జట్టుతో టెస్టు సిరీస్ ఆడి ఆటకు వీడ్కోలు పలకాలని అనుకుంటాడు. అయితే మ్యాచ్ స్టార్ట్ అయ్యే సమయంలో ఇతన్ని మ్యాచ్ ఫిక్సింగ్ సమస్యలోకి పెట్టాలని సిండికేట్ ప్రయత్నించి విఫలమవుతుంది. అయితే ఇదే సమయంలో సిండికేట్ దగ్గర సైంటిస్ట్ శరవణన్ (మాధవన్) అయిన బాధితుడు ఉంటాడు. టీచర్ అయిన తన భార్య కుముద (నయనతార) వెంట వెళ్లి అర్జున్ కొడుకును కిడ్నాప్ చేస్తాడు. ఇలా చేస్తే తన సమస్యలన్ని కూడా క్లియర్ అవుతాయని అనుకుంటాడు. అయితే అర్జున్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడా? మాధవన్ సమస్య పరిష్కారం అయ్యిందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
కిక్రెట్ అంటే ఇండియాలో మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమా తీశారు. ఇలాంటి సినిమాకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. శశికాంత్ క్రికెట్ నేపథ్యంలో ఈ స్టోరీని బానే రాశారు. రియల్‌గా జరిగే మ్యాచ్ ఫిక్సింగ్ నేపథ్యంలో స్టోరీ రాశారు. కానీ కొన్ని సన్నివేశాలు అయితే మనస్సును హత్తుకోవు. ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కావడం చాలా కష్టం. ఈ టెస్ట్ మూవీలో కొన్ని లాజిక్స్ కూడా మిస్ అవుతాయి. మ్యాచ్ ఫిక్సింగ్ స్టోరీ రియల్‌గా జరిగి చాలా ఏళ్లు అవుతుంది. ఇలాంటి సమయంలో ఈ సినిమా తీశారు. కథ ఇంకా బాగా రాసి ఉంటే సరిపోయేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మ్యాచ్ మధ్యలో మొబైల్స్ వాడటం, క్రికెటర్ కొడుకుని ఈజీగా కిడ్నాప్ చేయడం ఇవన్నీ కూడా లాజిక్ లెస్ అనిపిస్తాయి. చాలా సీన్లు సిల్లీగానే అనిపిస్తాయి. దీంతో ప్రేక్షకులు పెద్దగా ఈ సినిమాకి కనెక్ట్ కాలేరు. ఒక వైపు సిద్ధార్థ్ మ్యాచ్ ఫిక్సింగ్, మాధవన్ సమస్యలు, నయనతార ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనాలని ఈ మూడు స్టోరీలు కూడా ఇంట్రెస్ట్‌గానే సాగుతాయి. కానీ మొత్తం అలా ఉండదు. కాస్త స్టోరీ లాజిక్స్‌తో రాసి ఉంటే బాగుండేది.
నటీనటులు
ఈ సినిమాలో మాధవన్, సిద్ధార్థ్, నయనతార మెప్పించారు. ఎవరి పాత్రకు తగ్గట్లు నటించారు. ప్రతీ సీన్‌లో వారి నటనతో అదరగొట్టారు. మాధవన్, నయనతార కాంబినేషన్ కూడా అదిరిపోయింది. వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్లలో బాగా నటించారు. మిగతా వారంతా ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు
సాంకేతిక అంశాల విషయానికొస్తే టెస్ట్ మూవీ బానే ఉంది. విరాజ్ సింగ్ గోహిల్ ఛాయాగ్రహణం బాగుంది. క్రికెట్ మైదానంలోని కొన్ని సన్నివేశాలను బాగా తీశాడు. విజువల్స్‌లో కూడా బాగా క్వాలిటీ ఉంది. శక్తిశ్రీ గోపాలన్ సంగీతం సాధారణంగానే ఉంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయనిపిస్తుంది.
రేటింగ్- 2/5