Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • The Paradise Glimpse Nani Ura Mas Looks This

The Paradise glimpse: నాని ఊర మాస్ లుక్స్.. ఇదెక్కడి గ్లింప్స్ మావ.. కళ్లు చేదిరే స్టోరీ 

The Paradise glimpse: నాని ఊర మాస్ లుక్స్.. ఇదెక్కడి గ్లింప్స్ మావ.. కళ్లు చేదిరే స్టోరీ 
  • Edited By: NARESH ENNAM,
  • Updated on March 3, 2025 / 08:04 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

The paradise glimpse:

నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సహజ నటన, కొత్త కొత్త కథలతో సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. నేచురల్ స్టార్ నాని తన నటనతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. ఎలాంటి నటన అయినా కూడా సహజత్వంతో కనిపిస్తాడు. చాలా నేచురల్‌గా తన నటన ఉండటంతో నేచురల్ స్టార్ అని బిరుదు కూడా సంపాదించుకున్నాడు. సహాయ దర్శకుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేసి.. తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ వరుస హిట్‌లు సాధిస్తున్నాడు. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. ఈ టీజర్ చూసి అందరూ కూడా షాక్ అయ్యారు. నాని డిఫరెంట్ లుక్, డైలాగ్స్ ఊర మాస్ ఉన్నాయి. హెయిర్ స్టైల్ అన్ని డిఫరెంట్ లుక్ లో నాని కనిపించబోతున్నాడు. ఎప్పుడు కొత్త పాత్రలో కనిపించే నాని ఈసారి మరో కొత్త లుక్స్ లో రాబోతున్నాడు. ఎవరు ఊహించని విధంగా గ్లింప్స్ ఉన్నాయి. ఒక తల్లి కొడుకు గురించి చెప్పడం అనేది చాలా కొత్త ఐడియా. ఇక్కడితో స్టార్ట్ అవుతుంది.

చరిత్రలో అందరూ చిలుకలు, పావురాల గురించి రాశారు. కానీ అదే జాతికి చెందిన కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా నుంచి మాట్లాడే శవాల కథ అని, కాకుల గురించి స్టోరీ చెబుతుంది. గ్లింప్స్‌లోని ఒక్కో డైలాగ్ ఒక్కో ఆణిముత్యం. తన కొడుకు కథను చెబుతూ.. బూతులను కూడా ఉపయోగించారు. చాలా డిఫరెంట్ లుక్‌లో నాని కనిపిస్తాడు. దీంతో గ్లింప్స్ సూపర్‌గా ఉన్నాయని మళ్లీ దసరా కాంబో హిట్ పక్కా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే గ్లింప్స్ వేరే లెవెల్. డిఫరెంట్ స్టోరీలో సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఓన్లీ గ్లింప్స్ చూస్తేనే ఇలా ఉందంటే సినిమా ఎలా ఉంటుందో మీరే ఊహించవచ్చు. దీనికి తోడు అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది.

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలో నాని కూడా టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. వైవిధ్యమైన పాత్రల నటిస్తూ.. వరుస హిట్‌లు నాని సాధిస్తున్నాడు. నాని ఖాతాలో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. ఈగ,ఎవడే సుబ్రమణ్యం,భలే భలే మగాడివోయ్,కృష్ణ గాడి వీర ప్రేమ గాథ,నేను లోకల్,నిన్ను కోరి,ఎం.సి.ఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి),జెర్సీ,శ్యామ్ సింగ రాయ్,అంటే సుందరానికి,దసరా,హాయ్ నాన్న వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. నాని కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా పనిచేశారు. నాని తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 2కి కూడా హోస్ట్‌గా వ్యవహరించారు. ఇటీవల హాయ్ నాన్న సినిమాతో హిట్ కొట్టిన నాని మళ్లీ హిట్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Tag

  • Mass movie
  • Srikanth odela
  • The paradise glimpse
Related News
  • Young Directors: ఈ యంగ్ డైరెక్టర్లకే మెగాస్టార్ ఛాన్స్.. వాళ్లు ఎవరంటే?

  • Hero Nani: ది ప్యారడైజ్.. ఈ పాత్రకు నాని ఒకే చెప్పడం వెనుక ఇంత కారణం ఉందా?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us