Tollywood: చూడడానికి అచ్చం కవల పిల్లల్లానే ఉన్న టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..
Tollywood టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు తమ సిస్టర్స్ ను కూడా హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే మరి కొంతమంది హీరోయిన్లు తమ అక్కచెల్లెళ్లను సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంచుతున్నారు.

Tollywood:
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లు బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చాటారు. తమ అందంతో, నటనతో ఈ ముద్దుగుమ్మలు తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు.
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు తమ సిస్టర్స్ ను కూడా హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే మరి కొంతమంది హీరోయిన్లు తమ అక్కచెల్లెళ్లను సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంచుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నా .లేకపోయినా కూడా అచ్చం కవల పిల్లల్లా ఉన్న టాలీవుడ్ హీరోయిన్స్ కొందరు ఉన్నారు. సీనియర్ నటుడు విజయ్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఇద్దరు కూతుర్లు శ్రీదేవి, ప్రీతి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. వీరిద్దరూ టాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.ఇక పెళ్లి తర్వాత వీరిద్దరు కూడా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.అయితే ఇద్దరు కూడా చూడడానికి అచ్చం కవల పిల్లల్లానే కనిపిస్తారు. ఇక నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ తండేల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి విజయం అందుకుంది. సాయి పల్లవి చెల్లెలు పూజ. రీసెంట్గా పూజ పెళ్లి చేసుకుంది.సాయి పల్లవి, పూజ ఇద్దరు కూడా చూడడానికి అచ్చం కవల పిల్లల్లానే కనిపిస్తారు. అయితే సాయి పల్లవి చెల్లి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. చందమామ సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత కాజల్ మగధీర సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు కాజల్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది.
పెళ్లి తర్వాత కూడా కాజల్ పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం అందుకుంది. అయితే ఈమె చెల్లెలు పేరు నిషా అగర్వాల్. నిషా అగర్వాల్ కూడా తెలుగులో పలు సినిమాలలో నటించింది. కానీ నిషా అగర్వాల్ కాజల్ అగర్వాల్ రాణించిన రేంజ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించలేకపోయింది. ఆ తర్వాత నిషా అగర్వాల్ పెళ్లి చేసుకొని తన పూర్తి సమయాన్ని తన ఫ్యామిలీతోనే గడుపుతుంది. అయితే వీరిద్దరు కూడా చూడడానికి అచ్చం కవల పిల్లల్లాగానే కనిపిస్తారు. లోక నాయకుడు సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ గురించి అందరికీ తెలిసిందే.
ఇప్పటివరకు టాలీవుడ్ లో శృతిహాసన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకుంది.శృతిహాసన్ చెల్లెలు అక్షర హాసన్ కూడా చూడడానికి అచ్చం శృతిహాసన్ లానే ఉంటుంది. వీరిద్దరు కూడా చూడడానికి అచ్చం కవల పిల్లల్లానే ఉంటారు. అలాగే సీనియర్ హీరోయిన్స్ ఊర్వసి మరియు కల్పన గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరు కూడా చూడడానికి అచ్చం కవల పిల్లల్లానే కనిపిస్తారు.
-
Malayalam Movies: నానికి నచ్చిన మలయాళ మూవీస్ ఏంటో మీకు తెలుసా?
-
Court Movie : ఓటీటీలో కోర్ట్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
-
Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల
-
Ananya Nagalla: బాలీవుడ్లోకి అనన్య నాగళ్ల ఎంట్రీ.. ఏకంగా లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఛాన్స్
-
Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్
-
Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..