Anchor Anasuya: ఈ ఫీల్డ్‌లో అయితే మా ఆయన సక్సెస్ కాలేరు.. భర్తపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన అనసూయ
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ గురించి అసలు పరిచయం అక్కర్లేదు. యాంకర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. క్షణ మూవీతో సినిమాల్లోకి అనసూయ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా ప్రేక్షకులను మెప్పించింది.

Anchor Anasuya: యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ గురించి అసలు పరిచయం అక్కర్లేదు. యాంకర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. క్షణ మూవీతో సినిమాల్లోకి అనసూయ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా ప్రేక్షకులను మెప్పించింది. తన నటనతో ఆ పాత్రను సూపర్‌గా నటించింది. ఈ సినిమా అనసూయ కెరీర్‌ను మార్చేసింది. రంగస్థలం మూవీ తర్వాత అనసూయ చాలా బిజీగా ఉండేది. వరుస సినిమా ఆఫర్లతో ఉండేది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఎన్నో ఆఫర్ల రావడంతో యాంకరింగ్ చేయడం మానేసింది.
Read Also: లగ్జరీ కార్ల దిగుమతి సుంకం తగ్గింపు.. హైదరాబాద్‌లో రూ. 7 కోట్ల ట్యాక్స్ చోరీ
అనసూయ పుష్ప 2 మూవీలో చివరగా నటించింది. అయితే అనసూయ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఫ్యామిలీతో బయటకు వెళ్లిన అన్ని ఫొటోలను షేర్ చేస్తుంది. అనసూయ తన గ్లామర్ ఫొటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తుంది. ఎంత బిజీగా వర్క్‌లో ఉంటున్నా కూడా ఎప్పటికప్పుడూ ఫ్యామిలితో బయటకు వెళ్తుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త సుశాంక్ భరద్వాజ్‌తో కలిసి ఎప్పటికప్పుడు వెకెషన్‌కు వెళ్తుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భర్త సుశాంక్ గురించి అడగ్గా ఆమె కొన్ని విషయాలను తెలియజేశారు. కనిపించేలా తన భర్త ఉండరని షాకింగ్ విషయాలు అనసూయ తెలిపింది. తన భర్త గురించి మొదటిసారిగా ఇలా సంచలన వ్యాఖ్యలు తెలిపింది.
అనసూయ భరద్వాజ్ భర్త ఇంట్లో మొత్తం మెనేజ్మెంట్ చూసుకుంటారని తెలిపింది. అయితే తన భర్తలో ఉన్న టాలెంట్ గురించి అనసూయ తెలిపింది. తన భర్తకు ఎక్కువగా బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టమట. చాలా బాగా బైక్ రైడింగ్ చేస్తారని తెలిపింది. అయితే మీ భర్తను సినిమాల్లో నటించమని ఎవరూ అడగలేదా? అని అడిగారు. దీనికి అనసూయ షాకింగ్ రిప్లై ఇచ్చింది. నా భర్త ఒకవేళ యాక్టర్ అయితే మాత్రం అసలు సక్సెస్ కాలేరని అన్నారు. ఎందుకంటే నా భర్తకు అసలు నటించడం రాదు. చాలా మంది టాలీవుడ్ దర్శకులు తనని సినిమాల్లోకి నటించమని అడిగారట. కానీ తనకి ఇష్టం లేక ఎన్నో సినిమాను రిజక్ట్ చేసినట్లు తెలిపారు. తన భర్త మనస్సు మంచిదని, అసలు నటించలేరని అనసూయ తెలిపింది. అయితే అనసూయ ఇటీవల కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గృహ ప్రవేశం ఫొటోలను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం తెలిసింది.
Read Also: తండ్రికి తగ్గ తనయ.. స్టార్ హీరోయిన్ కంటే సితార ఫాలోయింగ్ మాములుగా లేదుగా!
అనసూయకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ వయస్సులో కూడా యంగ్ లుక్‌లో ఉంటుంది. అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ ఫొటోలను షేర్ చేస్తుంది. ఎక్కడికి వెకేషన్ లేదా ఫెస్టివల్ ఇలా ఎలాంటి ఫొటోలను అయినా కూడా అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Allu Arjun : తానా వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌కు షాకిచ్చిన రాఘవేంద్ర రావు
-
Samantha : ‘మీ వల్లే నేను బ్రతికున్నా’.. వేదిక పైనే కన్నీళ్లు పెట్టుకున్న సమంత
-
Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?
-
Naga Chaitanya : శోభిత వల్లే మారిన నాగ చైతన్య..ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ