Top Richest Heros: టాప్ రిచ్చెస్ట్ హీరోలు వీళ్లే!
Top Richest Heros దేశంలో ఉన్న రిచ్చెస్ట్ హీరోల్లో షారుఖ్ ఖాన్ మొదటి ప్లేస్‌లో ఉన్నాడు. షారుఖ్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ దాదాపుగా రూ.7300 కోట్లు ఉంటుందట. సినిమాల్లో రెమ్యూనరేషన్ భారీగానే తీసుకుంటారు.

Top Richest Heros: దేశంలో ఎందరో టాప్ హీరోలు ఉన్నారు. నిజానికి చాలా మంది హీరోలు ధనవంతులే ఉంటారు. పుట్టినప్పుడు పేదరికంలో ఉన్నా హీరోగా అయిన తర్వాత మాత్రం బాగానే డబ్బు సంపాదిస్తారు. హీరోగా వచ్చిన రెమ్యూనరేషన్‌తో పాటు వ్యాపారాలు చేస్తుంటారు. ఈ క్రమంలో వారు బాగానే డబ్బు సంపాదిస్తారు. దేశంలో ఎందరో హీరోలు కష్టపడి పైకి వచ్చిన వారు ఉన్నారు. అలాగే పుట్టుకతోనే కొందరు ధనవంతులు ఉంటారు. అయితే ప్రస్తుతం హీరోలు ఎక్కువగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. చాలా మంది రిచ్చెస్ట్ హీరోలు ఉన్నారు. అయితే దేశంలో ఉన్న హీరోల్లో టాప్ రిచ్చెస్ట్ హీరోలు ఉన్నారు. వారు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.
షారుఖ్ ఖాన్
దేశంలో ఉన్న రిచ్చెస్ట్ హీరోల్లో షారుఖ్ ఖాన్ మొదటి ప్లేస్‌లో ఉన్నాడు. షారుఖ్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ దాదాపుగా రూ.7300 కోట్లు ఉంటుందట. సినిమాల్లో రెమ్యూనరేషన్ భారీగానే తీసుకుంటారు. ఒక్కో సినిమాకు దాదాపుగా రూ.250 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఐపీఎల్‌లోని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కూడా షారుఖ్‌ఖన్‌దే. సినిమాల్లో చేసేటప్పుడు సాధారణంగా ఆస్తులు ఉండేవి. కానీ ఐపీఎల్‌లో ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత షారుఖ్‌ఖాన్ ఆస్తులు పెరిగినట్లు తెలుస్తోంది. అలాగే షారుఖ్‌ఖాన్‌కి సొంతంగా ఓ నిర్మాణ సంస్థ కూడా ఉంది. దీనిద్వారా కూడా షారుఖ్ ఖాన్ కోట్లు సంపాదిస్తున్నాడు.
నాగార్జున
ఇండియాలోని రిచ్చెస్ట్ హీరోల జాబితాలో టాలీవుడ్ హీరో నాగార్జున ఉన్నారట. నాగార్జున మొత్తం ఆస్తుల విలువ రూ.3310 కోట్లు. సౌత్‌లో ఎక్కువగా పారితోషికం తీసుకునే హీరో అయితే కాదు.. కానీ వ్యాపారాల ద్వారా నాగార్జునకి ఎక్కువగా లాభాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నాగార్జున రెండో స్థానంలో ఉన్నాడు.
సల్మాన్ ఖాన్
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గురించి తెలిసిందే. సల్మాన్‌ఖాన్‌కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో ఎక్కువగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుంటారు. ఈ హీరో మూడో స్థానంలో ఉన్నాడు. మొత్తం ఈ హీరోకి రూ.2900 కోట్ల ఆస్తి ఉంది.
అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్ సినిమాల్లో ఎక్కువగా స్టంట్‌లు, కొత్త ప్రయోగాలు చేస్తుంటాడు. బాలీవుడ్‌లో ఇతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇతని మొత్తం ఆస్తి విలువ దాదాపుగా రూ.2500 కోట్లు ఉంటుంది.
హృతిక్ రోషన్
హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతనికి గర్ల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. హృతిక్ రోషన్ మొత్తం ఆస్తి విలువ దాదాపుగా రూ.2000 కోట్లు ఉంటుంది.
అమీర్ ఖాన్
బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఎక్కువగా ఆఫర్లు వస్తుంటాయి. ఇతని మొత్తం ఆస్తి విలువ దాదాపుగా రూ.1862 కోట్లు ఉంటుంది.
అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ బిగ్ బీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో ఏళ్ల నుంచి సినిమాల్లో నటిస్తున్నారు. ఎంతో కష్టం మీద ఇంతటి స్థాయికి ఎదిగారు. అయితే అమితాబ్ బచ్చన్ మొత్తం ఆస్తి విలువ దాదాపుగా రూ.1600 కోట్లు ఉంటుంది.
రామ్ చరణ్
ఎనిమిదవ స్థానంలో హీరో రామ్ చరణ్ ఉన్నాడు. రామ్ చరణ్ మొత్తం ఆస్తుల విలువ రూ.1370 కోట్లు ఉంటుంది. రామ్ చరణ్ సినిమాల్లో రెమ్యూనరేషన్ ఎక్కువగానే తీసుకోవడంతో పాటు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి.
-
Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
Peddi Movie First Glimpse: వచ్చేసిన పెద్ది గ్లింప్స్.. మొత్తానికి ఆ షాట్ మాత్రం హైలెట్
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
-
Craze Heroine: హీరోయిన్ గా ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం కలెక్టర్ గా విధులను నిర్వహిస్తుంది.. ఎవరో తెలుసా..
-
Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్ కు జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసిన అట్లీ…అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా