Urvashi Rautela : 70 ఏళ్ల వృద్ధురాలిని కాపాడేందుకు డ్రెస్సు చించుకున్న ఊర్వశి రౌతేలా!

Urvashi Rautela : బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నిత్యం ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉంటుంది. తాజాగా, ఆమె కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌లోని కాన్స్ నగరానికి వెళ్లారు. అక్కడ రెడ్ కార్పెట్‌పై మొదటి రోజు ఆమె ధరించిన విచిత్రమైన గౌన్, దాని ధరతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, ఊర్వశి తన రెండవ రోజు ప్రదర్శనలో ధరించిన నల్లటి గౌన్ కు సంబంధించిన ఒక సంఘటన, ఆమె గొప్ప మనసును చాటి చెప్పింది.
Read Also:Rana Naidu Season 2: ‘రానా నాయుడు 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఈ సారి అంతకుమించి
డ్రెస్సు చిరగడానికి కారణం 70 ఏళ్ల వృద్ధురాలు
కాన్స్ ఫెస్టివల్లో ఊర్వశి బ్లాక్ సిల్క్ టఫెటా గౌన్‌లో కనిపించారు. దీన్ని నదా సాదే కోచర్ డిజైన్ చేశారు. ఈ గౌన్ స్లీవ్ కొద్దిగా చిరిగిపోయినట్లున్న ఒక వీడియో వైరల్ కావడంతో, అసలు ఏం జరిగిందో ఊర్వశి టీమ్ వివరణ ఇచ్చింది. ఊర్వశి కారులో వేదికకు వస్తుండగా, మార్గమధ్యంలో అకస్మాత్తుగా 70 ఏళ్ల వృద్ధురాలు రోడ్డు దాటడానికి కారు ముందుకొచ్చిందని టీమ్ తెలిపింది. ఆ వృద్ధురాలిని కాపాడేందుకు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశారని, దానివల్ల కారు ఒక్కసారిగా ముందుకు దూసుకుపోయిందని పేర్కొన్నారు.
చిరిగిన డ్రెస్సుతోనే రెడ్ కార్పెట్‌పై!
ఆ ఘటనలో వృద్ధురాలికి చిన్న గాయం కూడా తగలకుండా తప్పించుకున్నారు. కానీ, ఊర్వశి ధరించిన ఖరీదైన గౌన్ కొద్దిగా చిరిగిపోయింది. అయితే, ఊర్వశి వెంటనే వేరే డ్రెస్సు మార్చుకోకుండా, అదే చిరిగిన గౌన్‌తోనే రెడ్ కార్పెట్‌పై నడిచారు. ఆమె ఈ నిర్ణయం వెనుక ఉన్న నిజాయితీ, ధైర్యాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన ఊర్వశిలోని మానవత్వాన్ని, ఆమె ప్రాధాన్యతలను చాటి చెప్పిందని ఆమె టీమ్ వెల్లడించింది. ఫ్యాషన్ కంటే మానవత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, చిరిగిన డ్రెస్సుతోనే ఆత్మవిశ్వాసంతో రెడ్ కార్పెట్‌పై నడవడం ఆమె గొప్ప మనసును తెలియజేస్తుంది. ఈ సంఘటనను కేవలం ఒక డ్రెస్సు చిరిగిపోయిన కథగా కాకుండా, ఒక ప్రాణం కాపాడిన కథగా చెప్పాలని ఊర్వశి కోరుకున్నారు.