KA Paul Nimisha Priya Case: మరణ శిక్ష తప్పించుకున్న నిమిష ప్రియ.. త్వరలో విడుదల: కేఎ పాల్
KA Paul Nimisha Priya Case భారత ప్రభుత్వ అధికారులు, యెమెన్ నాయకులతో వరుసగా పది రోజులు పగలు, రాత్రి చర్చించి ఈ గొప్ప విజయాన్ని సాధించానని వెల్లడించారు.

KA Paul Nimisha Priya Case: నిమిష ప్రియ కేసు పై కేఎ పాల్ తాజాగా ఆసక్తికర పోస్టు పెట్టారు. తాను నిమిష ప్రియను జైలు నుంచి విడిపించే ప్రయత్నం చేస్తున్నానని, ఆమె జైలు నుంచి విడుదల కాబోతోందని ఆయన పేర్కొన్నారు. యెమెన్ లో జైలులోని భారతీయ నర్సు నిమిష ప్రియ విడుదల కానుంది అంటూ కేఏ పాల్ పోస్ట్ చేశారు. నిమిష త్వరలో భారతదేశానికి తిరిగి వస్తారని అన్నారు.
భారత ప్రభుత్వ అధికారులు, యెమెన్ నాయకులతో వరుసగా పది రోజులు పగలు, రాత్రి చర్చించి ఈ గొప్ప విజయాన్ని సాధించానని వెల్లడించారు. ఇందుకు సహకరించిన ప్రధాని మోదీకి, యెమెన్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే నిమిష ప్రియ విడుదలపై యెమెన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
BIG BREAKING NEWS. Indian Nurse Nimisha Priya from Sanaa , Yemen Prison will be released . English & Telugu . pic.twitter.com/oAbX5LABly
— Dr KA Paul (@KAPaulOfficial) July 21, 2025