Nimisha Priya Case: నిమిష ప్రియ కేసు పై విదేశాంగ శాఖ ఆసక్తికర వ్యాఖ్యలు
Nimisha Priya Case యెమెన్ దేశస్థుడైన వ్యక్తిని హత్య చేసిన కేసులో ఆమెకు ఆ దేశ ప్రభుత్వం మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Nimisha Priya Case: నిమిష ప్రియ కేసు ఎంతో సున్నితమైన కేసు అని మరణశిక్ష నుంచి తప్పించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయం అందిస్తోందని కేంద్ర విదేశాంగశాఖ తెలిపింది. యెమెన్ దేశస్థుడైన వ్యక్తిని హత్య చేసిన కేసులో ఆమెకు ఆ దేశ ప్రభుత్వం మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ నెల 16వ తేదీన నిమిష ప్రియను ఉరి తీయాల్సి ఉంది. అయితే యెమెన్ ప్రభుత్వం ఆ శిక్షను తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఈ రోజు స్పందిస్తూ, నిమిష ప్రియ కేసు పరిష్కారం కోసం కొన్ని స్నేహపూర్వక దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది.
ఈ అంశాన్ని దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నట్లు నిమిష ప్రియకు అవసరమైన అన్ని రకాల సాయన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు అక్కడ ఉన్న స్థానిక అధికారులతో నిరంతరం సంబంధం కల్పించుకుంటున్నామని కూడా విదేశాంగ శాక తెలిపింది. తలాల్ అబ్దో మెహదీ అనే యెమెన్ వ్యక్తిని 2017లో హత్య చేసిన నిమిష ప్రియకు క్షమాభిక్ష మంజూరు చేయాలని లేదా నష్టపరిహారం తీసుకోవాలని వస్తున్న ప్రతిపాదనలను తమ కుటుంబం తిరస్కరిస్తుందని బాధితుడి సోదరుడు అబ్దెల్ ఫత్తా మెహదీ తెలిపాడు.