Nimisha Priya Case: బ్లడ్ మనీకి అంగీకరించం… నిమిష ప్రియా కేసులో ట్విస్ట్
Nimisha Priya Case నిమిషకు శిక్ష పడాల్సిందేనని, బ్లడ్ మనీకి అంగీకరించబోమని తెలిపాడు. 2008లో కేరళ నుంచి యెమెన్ కు వెళ్లింది నిమిషా ప్రియా.

Nimisha Priya Case: నిమిష కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తలాల్ అబ్దో మెహ్దీ కుటుంబం క్షమాభిక్షకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. నేరానికి క్షమాపణ ఉండదని మృతుడి సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహది తెలిపాడు. నిమిషకు శిక్ష పడాల్సిందేనని, బ్లడ్ మనీకి అంగీకరించబోమని తెలిపాడు. 2008లో కేరళ నుంచి యెమెన్ కు వెళ్లింది నిమిషా ప్రియా. ఆ తర్వాత తిరిగొచ్చి వివాహం చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తిరిగి యెమెన్ వెళ్లింది. అక్కడ సొంత క్లినిక్ ప్రారంభించింది.
అప్పుడు తన వ్యాపారభాగస్వామి అయిన తలాల్ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో తలాల్ కు మత్తు ఇచ్చి పాస్ పోర్ట్ ను లాక్కోవాలని ప్రయత్నం చేసింది. అయితే మత్తుమందు డోస్ ఎక్కువై తలాల్ మరణించాడు. మృతదేహాన్ని ట్యాంక్ లో పడేసి పారిపోయే ప్రయత్నంలో దొరికిపోయింది. అయితే బాధిత కుటుంబానికి క్షమాధనాన్ని ఇచ్చేందుకు నిమిష కుటుంబం సిద్ధమైంది. క్షమాధనాన్ని తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ సంప్రిదింపులు జరుపుతున్నారు.