RRB: ఈ ఉద్యోగాలకు నేడే లాస్ట్ డే.. ఆలస్యం చేయకుండా వెంటనే ఇలా అప్లై చేసుకోండి

RRB:
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రతీ ఒక్కరూ కూడా కలలు కంటారు. అందులోనూ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఈ ఉద్యోగాల కోసం ఎంతగానో కష్టపడుతుంటారు. ఏ చిన్న ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినా సరే పెడుతుంటారు. అందులోనూ రైల్వే ఉద్యోగం అంటే వీటికి బాగా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చాలా మంది సాధించాలని అనుకుంటారు. అయితే రైల్వే బోర్డు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్‌ను రిలీజ్ చేస్తుంటుంది. ఈ క్రమంలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు లెవల్ 1 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి తేదీ. ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ నుంచి వీటికి అప్లై చేసుకోవచ్చు. అయితే వీటికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు లాస్ట్ తేదీ.
దరఖాస్తు ఫీజు అప్లై చేయడానికి మార్చి 3వ తేదీ చివరి రోజు. మీరు అప్లికేషన్‌లో ఏవైనా తప్పులు చేసి ఉంటే.. మార్పులు చేయడానికి కూడా అవకాశం ఉంది. మోడిఫికేషన్ విండో కూడా ఉంది. ఇది మార్చి 4వ తేదీన ప్రారంభమై మార్చి 13న ఎండ్ అవుతుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 32438 పోస్టులను ఆర్‌ఆర్‌బీ భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నాలుగు దశల్లో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో 100 ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాల్లో పరీక్ష రాయాలి. ఇందులో నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు ప్రశ్నకి 1/3 మార్కులు కోత విధిస్తారు.
ఆర్ఆర్‌బీ లెవల్ 1 పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కొన్ని రూల్స్ పాటించాలి. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత అభ్యర్థులు రిజిస్ట్రేషన్ వివరాలు నమోదు చేయాలి. అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత అకౌంట్‌లోకి వెళ్లి లాగిన్ కావాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపి ఫీజు చెల్లించాలి. సబ్మిట్‌పై క్లిక్ చేసి మీరు ఆ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. వీటికి అప్లై చేసుకోవడానికి పరీక్ష ఫీజు రూ.500. అయితే ఈ పరీక్షకు హాజరైన వారికి రూ.400 తర్వాత రిఫండ్ చేస్తారు. దివ్యాంగులు, మహిళ, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్‌మెన్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.250 మాత్రమే.