Animals : పులి, సింహాలను మంచిన దారుణమైన వాటి గురించి తెలుసా?

Animals : ప్రమాదకరమైన జీవులు అంటే వెంటనే గుర్తు వచ్చేది అడవి సింహాలు, పెద్ద సొరచేపలు, పాములు, పులులు, విషపూరితమైన పాములు కదా. ఈ జీవుల పదునైన దంతాలు, ప్రాణాంతకమైన కాటు తో మనుషులను గాయ పరచడమే కాదు చంపేస్తాయి కూడా. ఇక థ్రిల్లర్ సినిమాలకు కేంద్రంగా మారతాయి ఈ జంతువుల. కానీ మానవులకు అత్యంత ప్రమాదకరమైన జంతువు పెద్ద ప్రెడేటర్ కాదంటే నమ్ముతారా? ఇతర జంతువులు ఉన్నాయి. కానీ వీటికి పదునైన పంజాలు, కోరల దంతాలు లేవు అంటే ఆశ్చర్యం వేస్తుంది కదా. అయితే నిజానికి ఇవి చాలా చిన్నవి. ఇంతకీ పులులు, సింహాల కంటే ప్రమాదకరమైన జంతువులు ఏంటో చూసేద్దామా?
1. దోమలు
ఈ లిస్ట్ లో మొదటి ప్లేస్ ను ఆక్రమించింది దోమ. ఏంటి ఇవా? అనుకుంటున్నారా? ఈ చిన్న కీటకాలు భూమిపై ఉన్న అన్ని జీవుల కంటే ఎక్కువ మరణాలకు కారణమవుతాయి. మలేరియా, డెంగ్యూ జ్వరం, జికా వైరస్, యెల్లో ఫీవర్ వంటి వ్యాధులను ఎక్కువ వ్యాపించేలా చేస్తాయి. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 7 లక్షల మంది మరణిస్తున్నారు. చిన్నవే కానీ ఈ ప్రాణాంతక వ్యాధులను వ్యాప్తి చేయడంలో అన్నింటికంటే ముందున్నాయి.
2. మానవులు: యస్ మీరు విన్నది నిజమే. మానవులు కూడా అత్యంత ప్రమాదకరమైన జాతులలో రెండవ స్థానంలో నిలిచారు. యుద్ధం, పోరాటాలు, దొంగతనం, హత్య వంటి వాటిలో మనుషులు ఇతర మనుషులను చంపుతున్నారు. ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం వలన మానవులు తమ రెండవ అతిపెద్ద శత్రువులుగా పేరు గాంచారు. ఇలాంటి సంఘటనల వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 4 లక్షల మంది మరణిస్తున్నారు.
3. పాము: ప్రతి సంవత్సరం దాదాపు లక్ష మంది పాము కాటు కారణంగా మరణిస్తున్నారు. అందుకే మానవులలో వాటి పట్ల చాలా భయం ఉంటుంది. లోతట్టు తైపాన్, కింగ్ కోబ్రా, బ్లాక్ మాంబా వంటి జాతులు చాలా శక్తివంతమైన విషాన్ని కలిగి ఉంటాయి. అవి కొన్ని గంటల్లోనే మనిషిని చంపగలవు. ఆ కొండచిలువ 10 మీటర్ల పొడవు ఉంటుంది. మనిషిని కూడా మింగగలదు. వాటి రంగు కారణంగా ఎక్కడైనా సులభంగా దాక్కోగలవు. కాబట్టి వాటిని ప్రమాదకరమైనవిగా కూడా పరిగణిస్తారు.
4. కుక్కలు
కుక్కలు మానవులకు అత్యంత నమ్మకమైన సహచరులు. కానీ అవి కొన్ని పరిస్థితులలో ప్రమాదకరంగా కూడా మారవచ్చు. కుక్క లాలాజలం వల్ల మనుషులకు ప్రాణాంతకం. చికిత్స చేయకుండా వదిలేస్తే ప్రాణాంతక అవుతుంది. ఇది కుక్కల కాటు ద్వారా వ్యాపిస్తుంది. ప్రతి సంవత్సరం దాదాపు 59,000 మంది మరణానికి కారణమవుతుంది.
5. నత్తలు: మంచినీటిలో కనిపించే నత్తల కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 12 వేల మంది మరణిస్తున్నారు. స్కిస్టోసోమియాసిస్ పరాన్నజీవి నత్తలలో కనిపిస్తుంది, ఇది వాటి లాలాజలం ద్వారా చర్మాన్ని చేరుకోగలదు.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.