Funny Video: జూలో ఫన్నీ ఘటన.. ముద్దు పెట్టుకుంటున్న అమ్మాయి మీద ఉమ్మేసిన గొర్రె

Funny Video: కొంతమందికి జంతువులంటే చాలా ఇష్టం. పెట్ డాగ్స్ మాత్రమే కాదు, వీధి కుక్కల మీద కూడా బాగా ప్రేమ చూపిస్తారు. అయితే ఒక అమ్మాయి జూలో గొర్రెను ముద్దు పెట్టుకోబోయి షాక్ తిన్నది. ఆ అమ్మాయి గొర్రె పిల్లను ప్రేమగా ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటే, అది ఆమె మొహం మీద ఉమ్మి వేసింది. ఆ టైంలో ఆమె రియాక్షన్ చూడాలి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.
లామా(గొర్రెలు)లు సౌత్ అమెరికాలో ఉంటాయి. ఒంటె జాతికి చెందినవి. లామాలు ఉమ్మి వేయడం వాటి కమ్యూనికేషన్లో ఒక భాగం. ఎవరినైనా భయపెట్టడానికి, తమ డామినేషన్ చూపించడానికి లేదా గొడవలు పరిష్కరించడానికి అవి ఇలా చేస్తాయి.
Read Also : Royal Enfield : రాయల్ ఎన్ఫీల్డ్ జోరు.. రోజుకు ఎన్ని బైక్స్ అమ్ముడుపోతున్నాయో తెలుసా ?
వైరల్ అవుతున్న ఈ వీడియోలో చాలా క్లిప్స్ ఉన్నాయి. లామా వేర్వేరు సందర్భాల్లో ప్రజల మీద ఉమ్మి వేయడం చూడొచ్చు. వీడియో స్టార్టింగ్లో కొన్ని గుర్రాల మీద లామా ఉమ్మి వేస్తుంది. తర్వాత కారులో కూర్చున్న ఒక అమ్మాయి మీద ఉమ్మి వేసి షాక్ ఇస్తుంది. ఆ తర్వాత జూలో ఒక అమ్మాయి లామాకు ముద్దు పెట్టబోతే అది ఆమె మొహం మీద ఉమ్మి వేస్తుంది. ఇలాంటి చాలా ఫన్నీ క్లిప్స్ ఉన్నాయి. వీటిని చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.
View this post on Instagram
Read Also : Online Fraud : రూ. 10 వేల సోఫాను సెకండ్ హ్యాండ్లో అమ్మబోయి రూ. 5 లక్షలు పోగొట్టుకున్న ఇంజనీర్
ఈ ఫన్నీ వీడియోను ఇన్స్టాగ్రామ్లో @animalaffinit అనే అకౌంట్లో షేర్ చేశారు. ఇప్పటివరకు 3 లక్షల 70 వేల మందికి పైగా లైక్ చేశారు. కామెంట్స్ సెక్షన్ మొత్తం నవ్వుల ఎమోజీలతో నిండిపోయింది. లామా చేసిన పనికి నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు.
ఒక యూజర్ కామెంట్ చేస్తూ “లామా ఆ అమ్మాయిని బాగా అవమానించింది” అని అన్నాడు. ఇంకొక యూజర్ “అరె మోరి మైయా, ఎంత బ్యాడ్ మ్యానర్స్!” అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. “అది నా మొహం మీద ఉమ్మి వేసింది” అని మరొకరు రాశారు. ఇంకొక యూజర్ “లామాలు, ఒంటెలు ఉమ్మి వేస్తాయి” అని గుర్తు చేశాడు. “ఇంత నవ్వొచ్చిందంటే నా కడుపు నొప్పిగా ఉంది” అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు