Online Fraud : రూ. 10 వేల సోఫాను సెకండ్ హ్యాండ్లో అమ్మబోయి రూ. 5 లక్షలు పోగొట్టుకున్న ఇంజనీర్

Online Fraud : ఇంట్లోని పాత సామాన్లను ఆన్లైన్లో అమ్మేవాళ్లు జాగ్రత్తగా ఉండండి. ఒడిశాకు చెందిన 21 ఏళ్ల ఇంజనీర్ తాజాగా సైబర్ మోసానికి బలైపోయాడు. ఒక స్కామర్ ఈ ఇంజనీర్‌ను ఎలా బుట్టలో వేసుకున్నాడో, ఎలా అతడి అకౌంట్‌ను ఖాళీ చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. ఇలాంటి తప్పులు మీరు చేయకుండా ఉండాలంటే వాటి గురించి తెలుసుకోవడం మంచింది.
అసలు ఏం జరిగిందంటే?
శుభ్రా జెనా అనే ఇంజనీర్ పాత సోఫాను అమ్మకానికి పెట్టాలని ఆన్లైన్లో యాడ్ పోస్ట్ చేశాడు. యాడ్ చూడగానే ఒక స్కామర్ సోఫా కొంటానని అతడిని కాంటాక్ట్ అయ్యాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. శుభ్రా మే 8న రూ. 10 వేలకు సోఫా అమ్మాలని యాడ్ పెట్టాడు.
Read Also : Vaibhav Suryavanshi: క్రికెట్లో హిట్.. చదువులో ఫట్.. బోర్డ్ పరీక్షలో ఫెయిల్ అయిన వైభవ్ సూర్యవంశీ
యాడ్ పెట్టిన తర్వాత ఒక స్కామర్ శుభ్రాకు ఫోన్ చేసి తాను ఫర్నీచర్ డీలర్ రాకేష్ కుమార్ శర్మ అని చెప్పాడు. సోఫా కొనడానికి ఆసక్తి చూపించి ఇద్దరి మధ్య రూ. 8 వేలకు డీల్ కుదిరింది. డబ్బులు పంపడానికి స్కామర్ శుభ్రా బ్యాంక్ డీటెయిల్స్ అడిగాడు. మొదట్లో అంతా బాగానే ఉంది కానీ స్కామర్ చేసిన పేమెంట్ ఫెయిల్ అయింది. దాంతో స్కామర్ శుభ్రాను తన తల్లి బ్యాంక్ డీటెయిల్స్ పంపమని అడిగాడు.
ఇక్కడే శుభ్రా పొరపాటు చేశాడు. ఏదో తేడా ఉందని అప్పుడే గ్రహించి ఉండాల్సింది. కానీ శుభ్రా డీటెయిల్స్ షేర్ చేశాడు. ఆ తర్వాత స్కామర్ శుభ్రా తల్లి, శుభ్రా బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు లాగడం మొదలుపెట్టాడు. మే 10న స్కామర్ శుభ్రాకు ఫోన్ చేసి అతడి అకౌంట్ నుంచి పొరపాటుగా రూ. 5.22 లక్షలు డెబిట్ అయ్యాయని, ఆ డబ్బు తిరిగి ఇస్తానని నమ్మబలికాడు.
Read Also : Royal Enfield : రాయల్ ఎన్ఫీల్డ్ జోరు.. రోజుకు ఎన్ని బైక్స్ అమ్ముడుపోతున్నాయో తెలుసా ?
కానీ స్కామర్ డబ్బు ఇవ్వడానికి రాలేదు. ఆ తర్వాత అతడి నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. వెంటనే శుభ్రా, అతడి తల్లి బ్యాంక్ అకౌంట్లు చెక్ చేస్తే అందులో రూ. 5, 21, 519 మాయమయ్యాయి. అకౌంట్ చెక్ చేసిన వెంటనే శుభ్రా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చాడు.
స్కామర్ల బారి నుంచి ఎలా తప్పించుకోవాలి?
తెలియని వ్యక్తులతో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, యూపీఐ పిన్, ఓటీపీ షేర్ చేయకండి. ఎవరితోనైనా డీల్ చేసే ముందు ఆ వ్యక్తి గుర్తింపును చెక్ చేసుకోండి. ఆ తర్వాతే ఎలాంటి ఆర్థిక లావాదేవీలైనా చేయండి.