Grapes: ద్రాక్ష తీపిగా ఉందా? లేదా? ఇలా తెలుసుకోండి.

Grapes: ద్రాక్ష తియ్యగా ఉంటుందో లేదా పుల్లగా ఉంటుందో తెలుసుకోవడం జూదంలా అనిపిస్తుంది కదా. ఇదొక పెద్ద పరీక్ష. మార్కెట్లో ప్రకాశవంతంగా, తాజాగా, జ్యుసిగా కనిపిస్తాయి ద్రాక్షలు. వీటిని ఇంటికి తెచ్చినప్పుడు రుచి మాత్రం అసలు ఉండదు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ పుల్లగా కూడా ఉండవచ్చు. కొన్ని సార్లు తియ్యగా కూడా ఉండవచ్చు. మార్కెట్లో తిని చూస్తే తియ్యగా ఉన్నా సరే ఇంటికి వచ్చాక పుల్లగా అనిపిస్తాయి. లేదంటే మార్కెట్లో చూసిన దుమ్ముకు టేస్ట్ చేయాలి అనిపిస్తుందా? మరి తీపి ద్రాక్షలను కొనాలంటే ఏం చేయాలి? ఎలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి వంటి వివరాలు చూసేద్దాం.
ద్రాక్ష రంగు దాని రుచి గురించి చాలా చెబుతుంది. అవును, ఆకుపచ్చ ద్రాక్షలు లేత పసుపు లేదా బంగారు రంగులో ఉంటే, అవి తియ్యగా ఉంటాయి. అవి ముదురు ఆకుపచ్చగా, మెరుస్తూ కనిపిస్తే, అవి చాలావరకు పుల్లగా ఉన్నాయని అర్థం. నలుపు లేదా ఊదా ద్రాక్షలు ముదురు రంగులో ఉంటాయి. లేత తెల్లటి పూతను కలిగి ఉంటాయి. ఇవి సాధారణంగా తియ్యగా ఉంటాయి. లేత రంగు ఊదా రంగు ద్రాక్షలు పండనివిగా, కొద్దిగా పుల్లగా ఉండవచ్చు. అయితే లేత గులాబీ లేదా ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉండే ఎర్ర ద్రాక్ష పండ్లు తియ్యగా ఉంటాయి. లేత గోధుమ రంగు లేదా నిస్తేజంగా కనిపించే ఎర్ర ద్రాక్షలు పండలేదు అని అర్థం.
ద్రాక్ష యొక్క ఆకృతి
మంచి నాణ్యత గల తీపి ద్రాక్షలు కొద్దిగా మృదువుగా ఉంటాయి. కానీ మంచి ఆకృతిని కలిగి ఉంటాయి. ద్రాక్ష చాలా గట్టిగా ఉంటే, అవి పుల్లగా మారవచ్చు. మరోవైపు, ద్రాక్ష తొక్క చాలా మందంగా ఉంటే లేదా ముడతలు పడినట్లు కనిపిస్తే, అవి ఎక్కువగా పండి ఉండవచ్చు. లేదా తక్కువ రసం కలిగి ఉంటాయి. సన్నని తొక్క కలిగిన ద్రాక్షలు సాధారణంగా తియ్యగా, రసంగా ఉంటాయి.
రేకుల ఆకృతి: తీపి ద్రాక్ష గుత్తి కొమ్మ ఆకుపచ్చగా, బలంగా ఉంటుంది. ద్రాక్షను రీసెంట్ గానే కోసారని, లోపల ఇంకా తీపి ఉందని తాజా కొమ్మ సూచిస్తుంది. అదే సమయంలో, గుత్తి కాండం ఎండిపోయినా లేదా గోధుమ రంగులోకి మారినా, ద్రాక్ష చాలా కాలంగా నిల్వ ఉంటుందని వాటి రుచి చప్పగా లేదా పుల్లగా మారవచ్చని అర్థం చేసుకోండి.
ద్రాక్ష బరువు: మీరు ద్రాక్ష గుత్తిని చేతిలో పట్టుకున్నప్పుడు, అది బరువుగా అనిపిస్తే, ద్రాక్ష రసంగా, తియ్యగా ఉంటుందని అర్థం. లేత ద్రాక్ష, ఎండు ద్రాక్ష సాధారణంగా రుచిలో చప్పగా ఉంటాయి. వాటి తీపి తగ్గవచ్చు.
తెల్లటి పొడి పొర: ద్రాక్షపై లేత తెలుపు లేదా మసక పొర కనిపిస్తే, అది వాటి తాజాదనం, తీపికి సంకేతం. ఈ పొర సహజమైనది. ద్రాక్షను ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది. ద్రాక్ష చాలా మెరుస్తూ, మృదువుగా కనిపిస్తే, వాటిని ఎక్కువగా కడిగి లేదా నిల్వ ఉంచారని అర్థం. తీపి తక్కువ ఉంటాయి.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.