Vitamin C: అన్ని పుల్లని పండ్లలో విటమిన్ సి ఉంటుందా? మరి ఎందులో ఉంటుంది?

Vitamin C: పండ్లలో ఏది పుల్లగ ఉన్నా సరే అందులో విటమిన్ సి ఉంటుందని చాలా మంది నమ్ముతారు. సిట్రస్ పండ్లు శరీరానికి చాలా ప్రయోజనం చేకూరుస్తాయని.. వాటిని ఎంచుకునే వారు చాలా ఎక్కువ ఉంటారు. ఇక ఈ పండ్లు చర్మానికి, ఆరోగ్యానికి రెండింటికి ఉపయోగపడతాయి. రోగనిరోధక శక్తిని కూడా అందిస్తాయి ఈ పండ్లు. అయితే రోగనిరోధక శక్తిని పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, గాయాలను త్వరగా మాన్చడంలో మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తాయి ఈ పుల్లటి పండ్లు. అయితే ఇలా పుల్లటి పండ్లలో విటమిన్ సి ఉంటుందని చాలా మంది అనుకుంటారు. మరి ఇందులో నిజం ఎంత? అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రతి పుల్లని పండ్లలో విటమిన్ సి ఉండదు. కానీ ఇది చాలా సిట్రస్ పండ్లలో కనిపిస్తుంటుంది. అందుకే చాలా మంది నమ్ముతుంటారు. అయితే అన్నింటిలో ఉంటుందని చెప్పలేం. నిమ్మ, నారింజ, సీజనల్, ఆమ్లా, కివీ వంటి పండ్లలో మాత్రం విటమిన్ సి ఉంటుంది అంటున్నారు నిపుణులు. అయితే పెరుగు, టమాటా, చింతపండు, మజ్జిగ వంటి వాటిలో గానీ పుల్లని కూరగాయల్లో గానీ ఉండాల్సిన అవసరం లేదు. ఉండదు కూడా.
ఇక మీ ఆహారంలో విటమిన్ సి ఉండాలి అనుకుంటే ఇది ఉన్న పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. అంటే మీ ఆహారంలో సిట్రస్ పండ్లు అయినా నిమ్మ, నారింజ, టాన్జేరిన్, ద్రాక్ష వంట పండ్లను చేర్చుకోవాలి. అయ్యో మర్చిపోయాను. ఆమ్లా కూడా విటమిన్ సి కి మంచి మూలం. ఇక బొప్పాయి తియ్యగా ఉంటుంది కదా. కానీ ఇందులో కూడా విటమిన్ సి ఉంటుంది. స్ట్రాబెర్రీలు, కివిలో కూడా పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది.
చింతపండు వంటి పండ్లలో విటమిన్ సి ఉండదు. అవి పుల్లగా ఉంటాయి కానీ విటమిన్ సిని కలిగి ఉండవు. చాలా తక్కువ ఉంటుంది. ఇక పాల ఉత్పత్తులు కూడా కొన్ని పుల్లగా ఉంటాయి కానీ విటమిన్ సి మాత్రం ఉండదు అంటున్నారు నిపుణులు. ఇక కొన్ని ఊరగాయలు, పులియబెట్టిన వస్తువులు కూడా పుల్లగా ఉంటాయి కానీ విటమిన్ సి పరిమాణం చాలా తక్కువ ఉంటుంది.
ఇక విటమిన్ సి శరీరంలో తగినంతగా ఉండాలి. లేదంటే చాలా సమస్యలు వస్తాయి. రోగనిరోధక శక్తి బలహీనపడితే అనారోగ్యం మాటి మాటికి దెబ్బతింటుంది. చర్మం, జుట్టును కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ఈ విటమిన్ సి ఇనుమును గ్రహిస్తుంది. ఇక విటమిన్ సి లోపం ఉంటే స్కర్వీ అనే వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందట. అందుకే మీ ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చుకోండి. ఆమ్లా, నిమ్మరసం తాగడం వల్ల కావాల్సినంత విటమిన్ సి లభిస్తుంది అంటున్నారు నిపుణులు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.