Loneliness: ఒంటరితనం వల్ల ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా?
Loneliness ఒంటరితనం వల్ల స్ట్రాంగ్ అవుతారట. ఎందుకంటే సింగిల్‌గా ఉంటే మన ఎమోషన్స్ అన్ని కూడా మెరుగుపడతాయి. ఎలాంటి సిట్యూవేషన్స్‌లో అయినా కూడా స్ట్రాంగ్‌గా ఉండగలరు.

Loneliness: కొందరు ఇతరులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మరికొందరు ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే ఒంటరితనం మంచిది కాదని, చాలా డేంజర్ అని చాలా మంది అంటుంటారు. ఒంటరితనం వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారని, కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని అంటుంటారు. అయితే ఒంటరితనం కూడా ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎలాంటి నష్టాలు లేవని తాజా అధ్యయనాల్లో తేలింది. ఒంటరితనం వల్ల తొందరగా చనిపోతారని జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయని అనేవారు. అయితే ఒంటరితనం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇతరులతో కలిసి ఉండటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఒంటరితనం వల్ల కూడా అన్నే ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఓ సైంటిస్ట్ పదేళ్ల పాటు చేసిన రీసెర్చ్‌లో ఒంటరితనం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుని షాక్ అయ్యాడు. అయితే ఒంటరితనం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఒంటరితనం వల్ల స్ట్రాంగ్ అవుతారట. ఎందుకంటే సింగిల్‌గా ఉంటే మన ఎమోషన్స్ అన్ని కూడా మెరుగుపడతాయి. ఎలాంటి సిట్యూవేషన్స్‌లో అయినా కూడా స్ట్రాంగ్‌గా ఉండగలరు. ముఖ్యంగా ఎమోషన్స్‌కి వాల్యూ ఇస్తారు. అలాగే క్రియేటివిటీ కూడా బాగా పెరుగుతుందని అంటున్నారు. ఒంటరితనం వల్ల వారేంటో పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే వారి కోసం ఆలోచించుకోవడానికి కాస్త సమయం దొరుకుతుంది. ఒంటరితనం వల్ల తమ తప్పులను కూడా తెలుసుకుంటారు. అలాగే ఇతరల విషయంలో వారు చేసిన మిస్టేక్స్ ఏంటో కూడా తెలుస్తాయి. అలాగే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట. ఒంటరిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు వారిలో ఉన్న ఆందోళన, ఒత్తిడి అన్ని కూడా తగ్గుతాయి. రోజులో ఎంత బిజీగా ఉన్నా కూడా తన కంటూ కొంత ఏకాంత సమయం ఉండాలి. అప్పుడే వారు రోజులో చేసిన తప్పులు ఏంటో తెలుస్తాయి. దీంతో వారికి వారే స్ట్రాంగ్ అవుతారు.
ఒంటరితనం అన్ని సార్లు మంచిది కాదు. కొన్నిసార్లు మాత్రమే ఒంటరితనం మంచిది. ఎందుకంటే మీరు సంతోషంలో ఉన్నప్పుడు బాగుంటుంది. కానీ బాధలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉంటే మీకు ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. కాబట్టి మీ ఒంటరితనం ఎలాంటిదో దాని బట్టి మీరు ఉండాలి. కొన్నిసార్లు ఒంటరితనం కూడా డేంజర్. ఈ ఒంటరితనం భరించలేక కొందరు సూసైడ్ కూడా చేసుకుంటారు. ఎందుకంటే మనకి ఏదైనా లో ఫీలింగ్ కలిగినప్పుడు షేర్ చేసుకోవడానికి ఎవరైనా ఒక పర్సన్ ఉండాలి. లేకపోతే ఆ ఒంటరితనంలో సంతోషం లేకుండా బాధ ఎక్కువ అవుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు కూడా కొన్నిసార్లు వస్తాయి. మతిమరుపు రావడం, పూర్తిగా ఆలోచనలు నిలకడ లేకపోవడం, ఏ విషయానికైనా కూడా ఎక్కువగా ఆలోచించడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఒంటరితనం బెటర్. కానీ బాధలో ఉన్నప్పుడు అంత మంచిది కాదు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.