Social Media : వర్చువల్ ప్రపంచం.. వెలివేసిన బంధాలు.. సోషల్ మీడియా తెచ్చే ఒంటరితనం ఎలా ఉంటుందంటే ?

Social Media : సోషల్ మీడియాలో మీకు వేలల్లో, లక్షల్లో ఫాలోవర్లు ఉండొచ్చు. కానీ నిజమైన అనుబంధాల కొరత మాత్రం ఎప్పుడూ మిమ్మల్ని బాధిస్తూనే ఉంటుంది. కొందరు కొత్త వాళ్లలో స్నేహం చేయడానికి సోషల్ మీడియాను ఆశ్రయిస్తారు. కానీ వారు సరైనవారు కాకపోతే మీ ఆశలు నిరాశగా మారతాయి. ఎందుకంటే సోషల్ మీడియా ప్రపంచం ఒక బురద లాంటిది. మీరు ఎంత లోతుకు వెళ్తే అంత ఎక్కువగా ఇబ్బంది పడతారు. ఇందులో సానుకూల విషయాల కంటే ప్రతికూల విషయాలే ఎక్కువ. అవి నెమ్మదిగా మిమ్మల్ని కలవరపెడుతూ ఉంటాయి. మీరు ఫోన్‌లో అంత బిజీగా ఉండిపోతారు. ఎప్పుడు ఒంటరితనం బారిన పడ్డారో మీకే తెలియదు.
మీరు ఎంత ఎక్కువగా సోషల్ మీడియాను ఉపయోగిస్తే.. అంత ఎక్కువగా ఒంటరిగా ఫీలవుతారు. ఇన్‌స్టా లేదా ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇతరుల సంతోషాలు, విజయాలతో నిండిన చిత్రాలను చూసినప్పుడు మీలో అసూయ, పోలిక, ఒంటరితనం భావన పెరుగుతుంది.
Read Also:Vaibhav Suryavanshi: క్రికెట్లో హిట్.. చదువులో ఫట్.. బోర్డ్ పరీక్షలో ఫెయిల్ అయిన వైభవ్ సూర్యవంశీ
సోషల్ ఐసోలేషన్ అంటే ఏమిటి?
సోషల్ ఐసోలేషన్ అంటే ఎవరితోనూ మాట్లాడాలని అనిపించకపోవడం, ఇతరులతో కనెక్ట్ అయినట్లు అనిపించకపోవడం. మీకు సోషల్ మీటింగ్స్ తక్కువగా నచ్చుతాయి.నెమ్మదిగా మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం మానేస్తారు. దీని ఫలితంగా మీరు ఒంటరితనం బారిన పడతారు.
సోషల్ మీడియా వల్ల ఒంటరితనం ఎందుకు వస్తుంది?
సోషల్ మీడియా అతి పెద్ద లోపం ఏమిటంటే.. సోషల్ మీడియా ద్వారా కొత్త వ్యక్తులతో ఏర్పడే అనుబంధాలు నిజమైన అనుబంధాలు కావు. కాబట్టి వారి నుంచి ఎక్కువ ఆశించడం వల్ల మనకే బాధ కలుగుతుంది. ఎందుకంటే ఎదురెదురుగా మాట్లాడటానికి, కాల్ లేదా మెసేజ్‌లో మాట్లాడటానికి తేడా ఉంటుంది. మీరు ఒకరి ఎమోషన్స్, ఫీలింగ్స్‌ను అర్థం చేసుకోలేరు. దీనివల్ల అవతలి వ్యక్తి మీ మాటలను అర్థం చేసుకోవడం లేదని మీకు అనిపిస్తుంది.
Read Also:Viral Video : రోడ్డుపై స్కూటీతో విన్యాసాలు.. అమ్మాయి డేంజరస్ స్టంట్ వైరల్
కొద్దిసేపటి సంతోషం మాత్రమే
సోషల్ మీడియాలో కొత్త వ్యక్తులతో స్నేహం చేయడం వల్ల మీకు కొద్ది క్షణాల సంతోషం మాత్రమే లభిస్తుంది. కానీ నిజం ఏమిటంటే..ఇక్కడ మీకు 500 మంది స్నేహితులు ఉన్నప్పటికీ వారిలో ఎవరూ మీ నిజమైన స్నేహితులు కాదు. సోషల్ మీడియా మిమ్మల్ని వాస్తవ ప్రపంచంలోని మనుషుల నుండి నెమ్మదిగా దూరం చేస్తుంది. దీని ఫలితంగా మీకు ఒంటరితనం కలుగుతుంది.
మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటారు
సోషల్ మీడియాలో ఇతరులు కెరీర్, లవ్ లైఫ్ లేదా జీవితంలోని ఏదైనా మలుపులో మీకంటే మెరుగ్గా ఉండడం చూసి కొందరు తమ జీవితాన్ని వారితో పోల్చుకోవడం ప్రారంభిస్తారు. ఇదే వారికి ఒంటరితనం కలగడానికి కారణం అవుతుంది.
-
Viral Video : సీటు కోసం ఇంత డ్రామానా? ఢిల్లీ మెట్రోలో వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!
-
Viral Video : సోషల్ మీడియా పిచ్చి..కదులుతున్న రైలుకు వేలాడుతూ రీల్..క్షణాల్లోనే ఊహించని ప్రమాదం!
-
Renu Desai: ఇకపై ఆ వస్తువులు బ్యాన్ చేయండి.. దేశ ప్రజలకు రేణు దేశాయ్ రిక్వెస్ట్.. వైరల్ పోస్ట్
-
Alekhya Chitti Pickles: సినిమాల్లోకి అలేఖ్య చిట్టీ పికిల్స్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసింది.. హీరో ఎవరంటే?
-
Loneliness: ఒంటరితనం వల్ల ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా?
-
ChatGPT: చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. అన్ని ఫొటోలు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు