Night Feeling : రాత్రి ఎందుకు ఆ ఫీలింగ్స్ వస్తాయి. కారణం అదేనా?

Night Feeling :
చాలా మంది రాత్రి బాగుంటుంది అనుకుంటారు. కూల్ గా హాయిగా అనిపిస్తుంది అనే ఆలోచనలో ఉంటారు. పడుకోవచ్చు, ఏ టెన్షన్ ఉండదు అని ఫీల్ అవుతారు. కానీ చాలా మందికి ఈ సమయంలో విచారం, ఆందోళన, నిరాశ వంటి భావోద్వేగాలను పెంచుతుంది. అవును నిజమేనండోయ్ చాలా మంది మనసులో ఈ ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఒక వ్యక్తి రాత్రిపూట ఎందుకు ఎక్కువ నిరాశకు గురవుతాడు? త్రిపూట విచారం ఎందుకు పెరుగుతుంది? అనే అన్ని వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఒంటరితనం: రాత్రి సమయంలో పరిసరాలు నిశ్శబ్దంగా ఉంటాయి. ఇక ప్రజలు అందరూ కూడా విశ్రాంతి తీసుకుంటారు. కానీ కొందరు మాత్రం తన ఆలోచనలతో ఒంటరిగా ఉంటాడు. రోజంతా బిజీగా ఉండటం వల్ల, మనం మన ఆలోచనలను, భావోద్వేగాలను పెద్దగా పట్టించుకోరు. కానీ రాత్రిపూట ప్రశాంతంగా ఉన్నప్పుడు, అవే ఆలోచనలు, భావోద్వేగాలు బయటకు వస్తాయి. సో ఒంటరితనం, ప్రతికూల ఆలోచనల భారం ఒక వ్యక్తిని నిరాశకు గురి చేస్తాయి.
అలసట – శక్తి లేకపోవడం: రోజంతా అలసట తర్వాత, శరీర శక్తి తగ్గిపోతుంది. దీని కారణంగా వ్యక్తి మానసికంగా కూడా బలహీనంగా ఉంటాడు. అలసట కారణంగా, సానుకూల ఆలోచనలు చాలా అరుదుగా గుర్తుకు వస్తాయి. ప్రతికూల ఆలోచనలతోనే మనిషి సతమతం అవుతుంటాడు. దీని వల్ల మనిషి మరింత నిరాశకు గురి అవుతాడు.
మెలటోనిన్ హార్మోన్ ప్రభావం: రాత్రి సమయంలో, శరీరంలో నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఈ హార్మోన్ శరీరాన్ని నిద్రకు సిద్ధం చేస్తుంది. అయితే ఇది మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. మెలటోనిన్ స్థాయిలు పెరగడం వల్ల ఒక వ్యక్తి విచారం, నిరాశ వంటి భావోద్వేగాలకు గురి అవుతాడు.
సోషల్ మీడియా
ఈ రోజుల్లో ప్రజలు రాత్రిపూట సోషల్ మీడియా, ఇంటర్నెట్ లకు బానిస అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలను, వీడియోలను చూసి తనను తాను పోల్చుకుంటున్నారు. ఇది మనస్సులో ప్రతికూల భావాలకు దారితీస్తుంది. దీంతో ఆ వ్యక్తి నిరాశకు గురవుతాడు. ఇది కాకుండా, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్‌ల నుంచి వెలువడే నీలి కాంతి మెదడును చురుగ్గా ఉంచుతుంది. సో నిద్ర రాదు. ఒత్తిడిని పెంచుతుంది.
నిద్ర లేకపోవడం: నిద్రలేమి, నిద్ర లేకపోవడం నిరాశకు ప్రధాన కారణాలు . రాత్రిపూట నిద్రపోలేని వ్యక్తులు లేదా లేదంటే పనులు, సోషల్ మీడియా అంటూ నిద్రకు ఆటంకం కలిగించే వ్యక్తులకు ఎక్కువగా ప్రతికూల ఆలోచనలు వస్తాయి. నిద్ర లేకపోవడం మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా ఒక వ్యక్తి నిరాశకు గురవుతాడు.
జీవనశైలి – ఒత్తిడి: ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన స్థాయి పెరిగింది. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, సంబంధాలలో ఉద్రిక్తత వంటి సమస్యలు రాత్రిపూట మరింత తీవ్రమవుతాయి. ఒక వ్యక్తి ఈ సమస్యల గురించి ఆలోచించినప్పుడు, అతని మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దీంతో నిరాశ చెందుతున్నాడు మనిషి.
జీవ గడియారం : శరీరంలోని జీవ గడియారం (సిర్కాడియన్ రిథమ్) మానసిక స్థితి, శక్తి స్థాయిలను నియంత్రిస్తుంది. ఈ గడియారం కారణంగా, రాత్రిపూట శరీర కార్యకలాపాలు నెమ్మదిస్తాయి. మెదడు పనితీరు కూడా ప్రభావితమవుతుంది. ఇది ఒక వ్యక్తిని విచారంగా, నిరాశకు గురి చేస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.