Flowers: అందమైన రంగురంగల పూలను చూడాలి అనుకుంటే ఈ పుష్ప ప్రదర్శనను చూసేయవచ్చు.. ఎక్కడ అంటే?

Flowers : పువ్వుల అందం, వాటి సువాసనను ఎవరు ఇష్టపడరు చెప్పండి. ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది. రంగురంగుల పువ్వుల అద్భుతమైన ప్రదర్శన విషయానికి వస్తే, పూల ప్రదర్శన కంటే గొప్పది మరొకటి లేదు కదా. అయినా పువ్వుల ప్రదర్శన ఎక్కడ చేస్తారు ఇలాంటి షోలు కూడా ఉంటాయా అంటే? అవును ప్రతి సంవత్సరం ఉంటుంది. ఎక్కడ అనుకుంటున్నారా? ప్రతి సంవత్సరం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో అనేక అద్భుతమైన పుష్ప ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకమైన, అందమైన పువ్వులను మీరు చూడవచ్చు. అయితే ఈ సంవత్సరం ఈ 4 పెద్ద పుష్ప ప్రదర్శనలకు ప్రవేశం ఉచితం అంటున్నారు అధికారులు. అంటే, మీరు ఎటువంటి టికెట్ లేకుండా ఈ అద్భుతమైన తోట ఉత్సవాలను చూసి ఆనందించవచ్చు.
మీరు ప్రకృతి ప్రేమికులైతే లేదా తోటపనిపై ఆసక్తి కలిగి ఉంటే ఈ 4 అద్భుతమైన పుష్ప ప్రదర్శనలను మిస్ అవ్వకండి. ఈ ప్రదర్శనల ప్రత్యేకత ఏమిటి? అవి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఎక్కడ జరుగుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామా?
1. నోయిడా ఫ్లవర్ షో
నోయిడా ఫ్లవర్ షో ప్రతి సంవత్సరం ప్రకృతి ప్రేమికులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది అని చెప్పవచ్చు. ఈ ప్రదర్శనలో మీరు వివిధ రకాల స్వదేశీ, విదేశీ పుష్పాలను చూడవచ్చు. దీనితో పాటు, తోటపని సంబంధిత చిట్కాలు, వర్క్‌షాప్‌లు కూడా ఇక్కడ నిర్వహిస్తుంటారు. వీటి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఈ పూల ప్రదర్శన ఫిబ్రవరి 20 నుంచి ఫిబ్రవరి 23 వరకు నోయిడా సెక్టార్ 33Aలో జరగనుంది. అంటే ఆల్రెడీ ప్రారంభం అయింది. ఇంకో రెండు రోజులు జరుగుతుంది.
2. తులిప్ పండుగ
కాశ్మీర్‌లోని ఇందిరా గాంధీ తులిప్ గార్డెన్ లాంటి అందమైన దృశ్యాన్ని మీరు చూడాలనుకుంటే, ఢిల్లీలోని శాంతిపథ్ తులిప్ ఫెస్టివల్ కు వెళ్లాల్సిందే. ఈ పండుగలో మీరు లెక్కలేనన్ని రంగురంగుల జాతుల ట్యూలిప్లను చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడి అందమైన పువ్వులు మీ కళ్ళకు, హృదయానికి ప్రశాంతతను కలిగిస్తాయి. ఈ పండుగ ఫిబ్రవరి 7న ప్రారంభమై ఫిబ్రవరి 23 వరకు కొనసాగుతుంది. అంటే ఇది కూడా ముందే ప్రారంభం అయింది అన్నమాట.
3. అమృత్ ఉద్యాన్
రాష్ట్రపతి భవన్లో ఉన్న అమృత్ ఉద్యాన్‌ను గతంలో మొఘల్ గార్డెన్ అని పిలిచేవారు. ఇది భారతదేశంలోని అత్యంత అందమైన, చారిత్రాత్మక ఉద్యానవనాలలో ఒకటిగా చెబుతుంటారు. ప్రతి సంవత్సరం వసంతకాలంలో దీన్ని ప్రకృతి ప్రేమికుల కోసం ఓపెన్ చేస్తారు. ప్రజలు ఇక్కడకు వచ్చి అరుదైన పువ్వులు, 100+ రకాల గులాబీలు, బోన్సాయ్ సేకరణ, సంగీత ఫౌంటెన్లను చూడవచ్చు. ఈ అమృత్ ఉద్యానవనం ఫిబ్రవరి 2 నుంచి సాధారణ ప్రజల కోసం చేశారు. ఇక మార్చి 30 వరకు ఓపెన్ లోనే ఉంటుంది.
4. 37వ గార్డెన్ టూరిజం ఫెస్టివల్
మీకు తోటపనిపై ఆసక్తి ఉంటే, గార్డెన్ టూరిజం ఫెస్టివల్ మీకు గొప్ప అవకాశం అనే చెప్పవచ్చు. ఇక్కడ మీరు వివిధ జాతుల పువ్వులు, మొక్కలను చూడటమే కాకుండా, తోటపని నిపుణుల నుంచి చిట్కాలను కూడా పొందుతారు. అదనంగా, లైవ్ మ్యూజిక్, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఇది ఈ పండుగను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. ఈ పండుగ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 23 వరకు కొనసాగుతుంది.