Garden: పాములు పెరటిలోకి రాకూడదంటే.. పెంచాల్సిన మొక్కలు ఇవే

Garden: ఆరోగ్యం, అందం కోసం చాలా మంది పెరటిలో మొక్కలు పెంచుకుంటారు. కూరగాయలు, పువ్వుల మొక్కలు ఇలా ఎన్నో రకాలు పెంచుకుంటారు. వీటిని పెంచుకుంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ అందడంతో పాటు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాస్త చిరాకుగా ఉంటే పెరటికి వెళ్తే మనస్సుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎలాంటి టెన్షన్లు ఉన్నా కూడా తీరిపోతాయి. మరికొందరు రసాయనాలు ఉండే కూరగాయలను కొనలేక పెరటిలో పెంచుకుంటారు. అలాగే పువ్వులు అన్నింటిని కూడా రోజూ బయటకు వెళ్లి కొనలేని వారు కూడా ఇంటి పెరటిలోనే పెంచుకుంటారు. అయితే పెరటిలోకి పురుగులు, పాములు వంటివి వస్తుంటాయి. దీంతో కొందరు పెరటికి వెళ్లడానికి భయపడుతుంటారు. అయితే పెరటిలో ఎలాంటి పాములు, పురుగులు వంటివి రాకుండా ఉండాలంటే కొన్ని మొక్కలను పెంచాలని నిపుణులు అంటున్నారు. దీనివల్ల అసలు పాములు మీ పెరటి వైపు చూడవు. మరి పెరటిలో పెంచాల్సిన ఆ మొక్కలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
రోజ్మేరీ మొక్క
రోజ్మేరీతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. దీని మొక్కను ఇంటి పెరటిలో ఉంచితే అసలు పాములు ఆ దరికి చేరవు. దీని నుంచి ఘాటైన వాసన వస్తుంది. దీనివల్ల పాములు ఈ మొక్కల దగ్గరకు అసలు రావు. ఈ మొక్కను పెంచుకోవడం వల్ల మీకు రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. పెరటిలోకి పాములు రావు.. జుట్టుకు ఈ రోజ్మేరీని అప్లై చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా పెరటిలో ఈ రోజ్మేరీ మొక్కను పెంచండి.
వెల్లుల్లి
దీన్ని వంట్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. వెల్లుల్లి మొక్కను పెరటిలో నాటడం వల్ల వాటి ఘాటైన వాసనకు పాములు అసలు దరిచేరవు. అలాగే వెల్లుల్లి వల్ల కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని సాధారణంగా తినడం లేదా వంటల్లో వాడటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వెల్లుల్లి వల్ల చాలా వరకు అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. రెండు విధాలుగా కూడా ఉపయోగపడుతుంది.
లావెండర్
ఈ మొక్కల నుంచి మంచి వాసన వస్తుంది. దీని వాసన మనుషులకు బాగానే నచ్చుతుంది. కానీ ఈ లావెండర్ మొక్కల వాసన పాములకు నచ్చదు. పాములు సమస్య మీ పెరటిలో ఉంటే మాత్రం ఈ మొక్కలను తప్పకుండా పెంచండి. అయితే లావెండర్ మొక్కలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఇవి మంచి సువాసనను కూడా కలిగి ఉంటాయి.
బంతి పువ్వులు
ఈ పువ్వుల్లో ఉండే సహజ సమ్మేళనాలు పాములను తరిమి కొడతాయి. అయితే కొన్ని సీజన్‌లో మాత్రమే ఉంటాయి. ఎక్కువగా వర్షాల తర్వాత ఈ మొక్కలు అవుతాయి. ఈ పువ్వులు అందంగా కూడా ఉంటాయి. ఎక్కువ మంది పూజ, అందానికి పెంచుకుంటారు. కానీ ఇందులోని కొన్ని సమ్మేళనాల వల్ల పాముల సమస్య నుంచి ఈజీగా విముక్తి పొందవచ్చు.
-
Happy life: ఇలాంటి ఇంట్లో హ్యాపీ లైఫ్.. చల్లని గాలి.. ప్రశాంతత
-
Vastu Tips: ఇంట్లో వీటిని పెడితే.. సంపద పెరగడం ఖాయం
-
Woman : మన ఇంటిని చక్కదిద్దే మహిళకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి?
-
Maha Shivaratri: ఈ పువ్వులతో శివుడిని పూజిస్తే.. ఏం కోరుకున్న నెరవేరడం పక్కా!
-
Flowers: అందమైన రంగురంగల పూలను చూడాలి అనుకుంటే ఈ పుష్ప ప్రదర్శనను చూసేయవచ్చు.. ఎక్కడ అంటే?