Maha Shivaratri: ఈ పువ్వులతో శివుడిని పూజిస్తే.. ఏం కోరుకున్న నెరవేరడం పక్కా!

Maha Shivaratri:
దేశ వ్యాప్తంగా మహా శివరాత్రిని ఈ ఏడాది ఫిబ్రవరి 26న జరుపుకుంటున్నారు. పవిత్రమైన మహా శివరాత్రి నాడు పరమ శివుడిని భక్తితో పూజించడం వల్ల చేసిన పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి. అలాగే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఇంతటి పవిత్రమైన రోజున చాలా మంది భక్తితో పూజిస్తారు. మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు పాపాలు అన్ని కూడా తొలగిపోతాయని నమ్ముతారు. అయితే శివరాత్రి రోజు కొన్ని నియమాలు పాటిస్తూ శివుడిని పూజ చేస్తేనే ఫలితం ఉంటుంది. అయితే శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. గంగాజలం, పువ్వులు, పాలు ఇలా ఏ వస్తువులతో అయినా అభిషేకం చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. అయితే మహా శివరాత్రి నాడు శివుడిని ఏయే పువ్వులతో పూజిస్తే పాపాలు అన్ని తొలగిపోవడంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
మహా శివరాత్రి నాడు శివుడిని సంపంగి, మొగలి పువ్వులు కాకుండా ఇంకా ఏ పువ్వలతో అయినా కూడా పూజించవచ్చు. అయితే శివుడిని మందార పువ్వులతో పూజిస్తే అన్ని బాధలు కూడా క్లియర్ అవుతాయి. అలాగే గన్నేరు పువ్వులతో శివుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు అన్ని కూడా తగ్గుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అయితే అన్యాయంగా డబ్బు సంపాదించిన వారు ఉంటారు. ఇలాంటి డబ్బు దోషం కూడా పోతుంది. ఐశ్వర్యం సిద్ధించాలంటే.. పద్మ పుష్పాలతో శివుడిని పూజించాలి. శివుడిని సన్నజాజి పువ్వులతో పూజిస్తే వివాహ యోగం సిద్ధిస్తుంది. ఎవరైతే వివాహ కావడం లేదని బాధపడుతున్నారో వారు ఈ సన్నజాజి పువ్వులతో శివుడిని పూజించండి. చాలా మంది కారు, బైక్ కొనుక్కోవాలని ఉంటుంది. అలాంటి వారు శివుడిని జాజి పువ్వులతో పూజించండి. వీటితో పూజించడం వల్ల మీరు కొనాలనుకునే వాహనం తొందరగా కొనుక్కుంటారు.
పరమ శివుడిని గులాబీ పువ్వులతో పూజించడం వల్ల కోరికలు తొందరగా నెరవేరుతాయి. అలాగే మల్లె పూలతో శివుడిని పూజిస్తే.. దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి. ఉమ్మెత్త పువ్వులతో శివుడిని పూజిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. కదంబ పువ్వులతో శివుడిని పూజిస్తే అన్ని రకాల బాధలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. మహా శివరాత్రి నాడు శివుడికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ పువ్వులతో పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ఇంట్లో లేదా ఆలయంలో పెరుగు, పాలు, పంచదార, చెరకు రసం, పువ్వులు, బిల్వ పత్రాలు, చందనం ఇలా అన్నింటితో శివుడికి అభిషేకం చేయాలి. ఆ తర్వాత శివ పంచాక్షరి మంత్రాన్ని చదివి భక్తితో శివుడిని ధ్యానించాలి. అప్పుడే పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
-
Maha Shivaratri 2025 : మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఈ మహా శివరాత్రికి ఇలా శుభాకాంక్షలు చెప్పండి.
-
Maha Shivaratri 2025: శివుని మూడవ కన్ను నుంచి తాండవం వరకు ఏం నేర్పుతుందో తెలుసా?
-
Maha Shivaratri: ప్రతీ ఏటా పెరుగుతున్న శివ లింగం.. ఇంతటి పవిత్రమైన లింగం ఎక్కడుందంటే?
-
Maha Shivaratri: మహా శివరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటారు? కారణమేంటో మీకు తెలుసా?
-
Maha Shivaratri: శివుడికి ఇష్టమైన ఆకులు ఇవే.. వీటితో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు
-
Maha Shivaratri: ఈ నియమాలు పాటిస్తూ ఉపవాసం ఆచరిస్తే.. పుణ్యమంతా మీదే