Health Issues: వామ్మె.. అన్నం, చపాతీ కలిపి తింటే ఇంత ప్రమాదమా!

Health Issues:
రైస్ అనేది ప్రతీ ఒక్కరి డైట్‌లో తప్పకుండా ఉంటుంది. రోజూ ఏదో ఒక పూట తప్పకుండా తింటారు. కొందరికి అసలు అన్నం తినకపోతే పూర్తిగా తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. అయితే డైట్ ఫాలో అయ్యే వారు కొందరు రైస్‌కి బదులు చపాతీ తింటారు. చపాతీలోని పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఫిట్‌గా ఉండేలా చేస్తుంది. అయితే కొందరు అన్నం, చపాతీ కలిపి తింటారు. ఫుడ్ తిన్నామనే ఫీలింగ్‌తో పాటు ఆరోగ్యంగా ఉండాలని ఈ రెండింటిని కూడా తీసుకుంటారు. నిజానికి వీటిని సపరేట్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే. కానీ రెండు కలిపి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయిని నిపుణులు చెబుతున్నారు. అన్నం లేదా చపాతీ ఏదో ఒకటి తింటే పర్లేదు. కానీ రెండు కలిపి తినడం వల్ల దీర్ఘకాలిక సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే అన్నం, చపాతీ కలిపి తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. అయితే అన్నం, రోటీ కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మీరు రోటీ తిన్న రెండు గంటల తర్వాత అన్నం తినాలి. రైస్‌కి రోటీకి కాస్త గ్యాప్ ఇవ్వాలి. లేకపోతే గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ రెండు తినడానికి కాస్త గ్యాప్ ఉండాలి. అప్పుడే మీరు తినే ఫుడ్ ఈజీగా జీర్ణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చపాతీ, రైస్‌లోనూ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటంతో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. మీరు ఫాలో కావాల్సిన డైట్ అంతా కూడా స్పాయిల్ అవుతుంది. అలాగే మీ శరీరంలోకి ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు వెళ్తాయి. వీటికి బదులు మీరు కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఉండే వాటిని తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు అయితే వీటిని కలిపి అసలు తీసుకోకూడదు.
చపాతీ, అన్నం కలిపి తినడం వల్ల గ్లూటెన్ అలర్జీ కూడా పెరుగుతుంది. దీంతో పాటు గ్యాస్, ఎసిడిటీ సమస్యతో ఇబ్బంది పడతారు. చపాతీని ఎక్కువగా బరువు తగ్గాలనుకునే వారు, మధుమేహం ఉన్నవారు తింటుంటారు. నైట్ టైంలో చపాతీ తినడం వల్ల కాస్త షుగర్ లెవెల్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతుంటారు. ఇందులోని పోషకాలు బరువును తగ్గించడంతో పాటు ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తుంది. ముఖ్యంగా ఫిట్‌గా ఉండేలా చేస్తుంది. డైట్ ఫాలో అయ్యే ఎక్కువ శాతం మంది చపాతీలు తింటారు. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయని తింటారు. కండరాలు బలంగా కావడంతో చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.