Mango Juice: అధికంగా మామిడి జ్యూస్ తాగితే.. మీకు ఈ సమస్యలు తప్పవు
Mango Juice మ్యాంగో జ్యూస్ ఎక్కువగా తాగడం వల్ల అలెర్జీ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మామిడి జ్యూస్‌లో ఎక్కువగా పాల ఉత్పత్తులు ఎక్కువగా వాడుతారు. వీటివల్ల చర్మంపై దద్దుర్లు, దురద వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి వేసవిలో ఎక్కువగా మ్యాంగో జ్యూస్ తాగవద్దు.

Mango Juice: మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. ఈ సీజన్లో మామిడి పండ్లు ఎక్కువగా లభించడంతో చాలా మంది వీటిని తింటారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రికి కూడా ఈ మామిడి పండ్లనే తీసుకుంటారు. వీటిలోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రానివ్వవు. ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అయితే వేసవిలోనే మామిడి పండ్లు లభిస్తాయని కొందరు వీటిని ఎక్కువగా తింటారు. అంటే రోజుకి ఒకటి రెండు కాకుండా ఒక పది వరకు తింటారు. ఇలా అధికంగా తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు మామిడి పండ్లను కాకుండా మామిడి జ్యూస్ కూడా తాగుతారు. ఎందుకంటే వేసవిలో చల్లదనం కోసం చాలా మంది తాజా జ్యూస్‌లు తాగుతారు. మామిడి అంటే ఇష్టం ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకుంటారు. వీటివల్ల కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎక్కువగా మ్యాంగో జ్యూ్స్ తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
అలెర్జీ
మ్యాంగో జ్యూస్ ఎక్కువగా తాగడం వల్ల అలెర్జీ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మామిడి జ్యూస్‌లో ఎక్కువగా పాల ఉత్పత్తులు ఎక్కువగా వాడుతారు. వీటివల్ల చర్మంపై దద్దుర్లు, దురద వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి వేసవిలో ఎక్కువగా మ్యాంగో జ్యూస్ తాగవద్దు.
ఊబకాయం
మామిడి పండ్లు తీపిగానే ఉంటాయి. దీనికి తోడు జ్యూస్‌లో చక్కెర, పాలు వంటివి ఉపయోగిస్తారు. వీటివల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అలాగే బరువు ఎక్కువగా ఉన్నవారు కూడా మామిడి జ్యూస్‌ను తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
జీర్ణ సమస్యలు
మామిడి కొందరి బాడీకి వేడి చేస్తుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఎక్కువగా మామిడి జ్యూస్ తీసుకునే వారికి కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కిడ్నీ సమస్యలు
మామిడిలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. దీనివల్ల కిడ్నీ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య ఉన్నవారు తీసుకున్నా కూడా కిడ్నీ వ్యాధి ఎక్కువ అవుతుంది.
దంత సమస్యలు
ఎక్కువగా మామిడి పండ్ల జ్యూస్ తీసుకోవడం వల్ల దంత సమస్యలు వస్తాయి. ఎందుకంటే మామిడి జ్యూస్‌లో ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల దంతాలపైన ఉన్న ఎనామిల్ పోతుంది. దీనివల్ల దంత సమస్యలు వస్తాయి. కాబట్ట ఎక్కువగా వేసవిలో మామిడి జ్యూస్ తాగవద్దు.
మొటిమలు
మామిడి పండ్ల వల్ల బాడీకి వేడి చేస్తుంది. దీనివల్ల ముఖంపై మొటిమలు వస్తాయి. సాధారణంగానే వేసవిలో ఎక్కువగా వేడిగా ఉంటుంది. దీనికి తోడు వేడి చేసే మామిడి పండ్లను తింటే మాత్రం మొటిమలు, మచ్చలు ఎక్కువగా వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి వేసవిలో ఎక్కువగా మ్యాంగో జ్యూస్
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.