Summer Fruit: సమ్మర్లో దొరికే ఈ ఫ్రూట్ తింటే.. రోగాలన్నీ పరార్
వేసవిలో ఎక్కువగా దొరికే మామిడి పండ్లు అంటే చాలా మందికి ఇష్టం. వీటి కోసమే కొందరు సమ్మర్ రావాలని కోరుకుంటారు. ఈ సీజన్లో ఎక్కడ చూసినా కూడా ఇవే కనిపిస్తాయి. పచ్చి, పండు ఇలా రకరకాలు ఉంటాయి. మామిడిలో చాలా రకాలు ఉన్నాయి.

Summer Fruit: వేసవిలో ఎక్కువగా దొరికే మామిడి పండ్లు అంటే చాలా మందికి ఇష్టం. వీటి కోసమే కొందరు సమ్మర్ రావాలని కోరుకుంటారు. ఈ సీజన్లో ఎక్కడ చూసినా కూడా ఇవే కనిపిస్తాయి. పచ్చి, పండు ఇలా రకరకాలు ఉంటాయి. మామిడిలో చాలా రకాలు ఉన్నాయి. మామిడి కాయను ఏ విధంగా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి మంచిదే. సమ్మర్లో అయితే చాలా మంది మూడు పూటలు కూడా మామిడి పండ్లను తీసుకుంటారు. చాలా మందికి ఈ మామిడి పండ్లు అంటే పిచ్చి. కూర తినకుండా వీటితోనే పూర్తి అన్నం తింటుంటారు. ముఖ్యంగా పిల్లలు అయితే ఎంతో ఇష్టం తింటారు. వీటిలోని పోషకాలు శరీరానికి ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తు్ంది. డైలీ వీటిని తీసుకున్నా కూడా మంచిదే. అయితే వేసవిలో ఎక్కువగా లభ్యమయ్యే మామిడి పండ్లను డైలీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
రోగనిరోధక శక్తి
పచ్చి, పండు మామిడిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. లాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవ ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అయితే ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ల దరిచేరవు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు కూడా రావని నిపుణులు అంటున్నారు. వేసవిలో మామిడి పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
వడదెబ్బ
వేసవిలో ఎక్కువగా వడ దెబ్బ తగులుతుంది. అయితే పచ్చి లేదా పండు మామిడిని తీసుకుంటే బాడీ చల్లగా అవుతుంది. అలాగే బాడీ డీ హైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. పచ్చి మామిడితో జ్యూస్ చేసుకుని తాగినా కూడా శరీరానికి శక్తి లభిస్తుంది. దీంతో వడదెబ్బ తగలదని నిపుణులు అంటున్నారు.
Read also: ధరించే దుస్తుల్లోనే రిచ్‌గా కనిపించాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే
జీర్ణక్రియ ఆరోగ్యం
కొందరు జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు పచ్చి మామిడిని తీసుకుంటే సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఫైబర్, పెక్టిన్, మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు క్లియర్ అవుతాయని అంటున్నారు. కొందరికి ఆకలి తక్కువగా ఉంటుంది. అలాంటి వారు మామిడి కాయను వేసవిలో తీసుకోవడం వల్ల ఆకలి కూడా పెరుగుతుంది.
లివర్ ఆరోగ్యం
పచ్చి మామిడి వల్ల లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు వెళ్లేలా చేస్తుంది. పచ్చి మామిడి జ్యూస్ కూడా చేసి తాగవచ్చు. ఇలా తాగినా కూడా లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Read also: టాప్ అప్ లోన్ తీసుకునే ముందు.. ఈ విషయాలు తప్పనిసరి
చర్మ, జుట్టు ఆరోగ్యం
పచ్చి మామిడిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపేలా చేస్తాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేయడంతో పాటు చర్మం మెరిసేలా చేస్తుంది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.