Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • India Covid Cases Rise Jn1 Variant Doctors Opinion

COVID Cases : కరోనా మళ్లీ వస్తుందా? తాజా కేసుల వ్యాప్తిపై డాక్టర్లు ఏమంటున్నారంటే ?

COVID Cases : కరోనా మళ్లీ వస్తుందా? తాజా కేసుల వ్యాప్తిపై డాక్టర్లు ఏమంటున్నారంటే ?
  • Edited By: rocky,
  • Updated on May 20, 2025 / 05:41 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

COVID Cases : కరోనా మహమ్మారి దాదాపు ముగిసిపోయిందని అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో తాజాగా కొన్ని ఆసియా దేశాల్లో ముఖ్యంగా సింగపూర్, హాంకాంగ్‌లలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీనితో పాటు భారతదేశంలో కూడా గత కొన్ని రోజులుగా స్వల్పంగా కేసులు పెరగడం ఆంధోళన కలిగిస్తుంది. ముఖ్యంగా JN.1 అనే కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో కరోనా పరిస్థితి పై వైద్య నిపుణులు అభిప్రాయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

భారతదేశంలో కోవిడ్-19 కేసులు మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి. మే 19, 2025 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల్లో ( అంటే మే 12 నుంచి) 164 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో కేరళలో 69, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు ఉన్నాయి. కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, సిక్కింలలో కూడా కొన్ని కొత్త కేసులు నమోదయ్యాయి.

Read Also:Bhairavam Boycott : ట్రెండ్ అవుతున్న భైరవం బాయ్‌ కాట్.. ఎందుకోసమంటే?

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిని వివరాల ప్రకారం ప్రస్తుతానికి భారతదేశంలో కరోనా పరిస్థితి కంట్రోల్ లోనే ఉంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేసుల సంఖ్య తక్కువగానే ఉందని, చాలావరకు తేలికపాటి లక్షణాలతోనే ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని కేసులు ఎక్కువ ఉన్నాయి. ముంబైలోని కేఈఎం ఆసుపత్రిలో నమోదైన రెండు కోవిడ్ సంబంధిత మరణాలు కూడా సహ-వ్యాధులతో (co-morbidities) సంబంధం కలిగి ఉన్నాయని, కరోనాతో ప్రత్యక్ష సంబంధం లేదని ఆసుపత్రి స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఆసియా దేశాల్లో పెరుగుతున్న కేసులకు ప్రధాన కారణం JN.1 వేరియంట్. ఇది ఒమిక్రాన్ BA.2.86 వంశానికి చెందిన ఉప-వేరియంట్. ఇది వేగంగా వ్యాప్తి చెందగలదని నిపుణులు చెబుతున్నారు. ఈ వేరియంట్ రోగనిరోధక శక్తి నుండి తప్పించుకునేందుకు కనీసం 30 మ్యుటేషన్లకు గురయ్యే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.

ఈ మ్యూటేషన్ బారిన పడిన వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఎక్కువ అలసట కనిపించవచ్చు. చాలావరకు కేసులు తేలికపాటివిగా ఉండి, ఇంటి వద్దనే నయమవుతున్నాయి. అయితే, వృద్ధులు, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు లేదా రోగనిరోధక శక్తిని అణచివేసే మందులు తీసుకునేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.వైద్యులు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా కనుమరుగు కాలేదని ఇది ఎండమిక్ మారే అవకాశం ఉందని, కాలానుగుణంగా కేసులు పెరుగుతూ ఉండవచ్చని డాక్టర్లు తెలిపారు. ఇది సాధారణ ఫ్లూ మాదిరిగానే చికిత్స తీసుకుంటే నయం అవుతుందన్నారు.

Read Also:Bael Sharbat: వడదెబ్బకు చెక్ పెట్టే బేల్ షర్బత్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి

చాలా మందికి వ్యాక్సిన్లు తీసుకుని చాలా కాలం కావడంతో, బూస్టర్ డోసులు తీసుకోకపోవడంతో రోగనిరోధక శక్తి తగ్గడమే ప్రస్తుత కేసుల పెరుగుదలకు కారణమని డాక్టర్ తెలిపారు. అప్‌డేట్ చేసిన కోవిడ్-19 బూస్టర్ డోసులు JN.1 ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ అందిస్తాయన్నారు. JN.1-నిర్దిష్ట వ్యాక్సిన్లు లేనప్పటికీ ముఖ్యంగా బలహీన వర్గాల వారు బూస్టర్ డోసులు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు గట్టిగా సిఫార్సు చేస్తున్నారు.

కొన్ని పాటిస్తే మహమ్మారి మన వద్దకు రాకుండా చేయవచ్చు. రద్దీగా ఉండే ప్రదేశాలలో లేదా సరిగా వెంటిలేషన్ లేని ప్రదేశాలలో మాస్క్ ధరించండి. తరచుగా చేతులు కడుక్కోవాలి.
అనారోగ్యంగా అనిపిస్తే రద్దీ ప్రదేశాలకు వెళ్లడం మానుకోండి. బూస్టర్ డోస్ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. పాజిటివ్ అని తేలితే ఇంట్లోనే ఉండి ఐసోలేట్ అవ్వండి.వైరస్ వ్యాప్తిని గుర్తించడానికి, ట్రాక్ చేయడానికి జెనోమిక్ సర్వైలెన్స్ (Genomic surveillance) చాలా ముఖ్యమని వైద్యులు నొక్కి చెబుతున్నారు.

Tag

  • COVID cases rise India
  • COVID symptoms JN.1
  • Doctors' opinion
  • India COVID-19 resurgence
  • JN.1 variant India
Related News
    Latest Photo Gallery
    • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

    • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

    • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

    • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

    • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

    • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

    • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

    • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

    • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

    • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

    Trending Telugus
    • Telangana
    • Andhra Pradesh
    • Entertainment
    • Sports
    • Technology
    • Lifestyle
    • Crime
    • Business
    • Education
    • Spiritual

    © 2025 All Rights Reserved

    Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us