Jaggery Benefits: వేసవిలో బెల్లం తింటే మంచిదేనా?
Jaggery Benefits బెల్లంలో ఐరన్, కాల్షియం, భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఎ, బి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Jaggery Benefits: బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చాలా మంది పంచదారకు బదులు బెల్లం ఎక్కువగా వాడుతుంటారు. పంచదార తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని ఎక్కువగా బెల్లం వాడుతారు. ఆయుర్వేదం పరంగా కూడా దీనిలో పోషకాలు ఉన్నాయి. అయితే బెల్లం ఏ సీజన్‌లో తీసుకున్నా కూడా ఆరోగ్యానికి మంచిదే అంటుంటారు. రోజుకి కనీసం చిన్న ముక్క బెల్లం తింటే బాడీలో బ్లడ్ పెరుగుతుంది. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటుంటారు. అయితే బెల్లం ఎక్కువగా తీసుకుంటే బాడీ వేడి చేస్తుంది. వింటర్ సీజన్‌లో పర్లేదు. కానీ వేసవిలో బెల్లం తింటే ఇంకా బాడీ వేడి చేస్తుందని నిపుణులు అంటున్నారు. చాలా మందికి ఈ విషయం తెలియక వేసవిలో ఎక్కువగా బెల్లం తింటారు. బెల్లం ముక్క తినడంతో పాటు పంచదారకు బదులు బెల్లం వాడుతారు. అయితే వేసవిలో బెల్లం తినవచ్చా? తింటే ఏమవుతుంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
బెల్లంలో ఐరన్, కాల్షియం, భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఎ, బి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది జీర్ణక్రియను తగ్గిస్తుంది. అలాగే రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. అయితే సాధారణంగా బెల్లం బాడీకి వేడి చేస్తుంది. అందులోనూ వేసవిలో అంటే బాడీ సాధారణంగానే వేడిగా ఉంటుంది. దీనివల్ల బాడీ ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. దీంతో చర్మంపై మొటిమలు, మచ్చలు వస్తాయి. అలాగే అజీర్ణం, ఎసిడిటీ, కడుపు సమస్యలు, మలబద్ధకం వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మీకు అధికంగా రక్తహీనత సమస్య ఉండి.. తగ్గాలని వేసవిలో బెల్లం తీసుకోవాలంటే డైరెక్ట్‌గా కాకుండా తీసుకోవాలి. అంటే ఒక గ్లాసు వాటర్‌లో బెల్లం వేసి.. అది కరిగిన తర్వాత తాగవచ్చు. ఇలా తాగడం వల్ల బాడీ చల్లగా మారుతుంది. అవసరం అయితే పుదీనా, నిమ్మరసం వంటివి కూడా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకుంటే బాడీ కూడా చలవ చేస్తుందని అంటున్నారు.
పోషకాలు ఎక్కువగా బెల్లంలో ఉంటాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. డైలీ బెల్లం తీసుకుంటే ఎన్నో సమస్యలు తగ్గుతాయి. అయితే ఇది కూడా లిమిట్‌లో మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే బెల్లంలోని పోషకాలు శరీరానికి ఉపయోగపడతాయి. లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి బెల్లం రోజుకి చిన్న ముక్క కాకుండా.. వారానికి మూడు లేదా నాలుగు సార్లు తినండి. టీ, కాఫీ, తీపి పదార్థాలు చేసేటప్పుడు పంచదారకు బదులు బెల్లం వాడండి. దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.