Kids Health: పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పదార్థాలను అసలు ఇంటికి తీసుకెళ్లవద్దు

Kids Health: ఈ మధ్య కాలంలో పిల్లలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువగా చిన్న వయస్సులోనే సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఉండే వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే పిల్లల ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే తల్లిదండ్రులు పాత్ర తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే వారు పిల్లలకు పెట్టే ఫుడ్ బట్టి ఆరోగ్యంగా ఉంటారు. ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు చాలా బీజీగా ఉండి పిల్లలు ఏం తింటున్నారో కూడా తెలియడం లేదు. వారికి నచ్చినవి కొని ఇస్తే పిల్లలు అల్లరి చేయరని చాలా మంది తల్లిదండ్రులు వారికి అన్ని పదార్థాలను కొని ఇస్తున్నారు. జంక్ ఫుడ్స్, డ్రింక్స్ వంటివి కొని ఇవ్వడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వీటిలో ఎలాంటి పోషకాలు లేకపోవడం వల్ల ఇవి పిల్లల ఆరోగ్యానికి అంత మంచివి కావు. అయితే ప్రతీ తల్లిదండ్రులు కూడా ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని రకాల పదార్థాలను అసలు తీసుకెళ్లకూడదు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
జ్యూస్‌లు
ఈ మధ్య కాలంలో డీమార్ట్ వంటి సూపర్ మార్కెట్‌లో ఆపిల్, జామ కాయ వంటి జ్యూస్‌లు ఉంటాయి. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తాగుతుంటారు. అయితే వీటిని అసలు పిల్లలకు ఇవ్వకూడదు. ఎందుకంటే వీటిని తాజా పండ్లతో చేయరు. ఎక్కువ రోజులు నిల్వ ఉండానికి రసాయనాలు వాడుతారు. వీటివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఇందులో ఎక్కువగా షుగర్ కంటెంట్ కూడా ఉంటుంది. దీనివల్ల పిల్లలకు చిన్న వయస్సులోనే మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది. వీటితో పాటు దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లో కూడా వీటిని ఇవ్వద్దు.
బిస్కెట్లు
చాలా మందికి బిస్కెట్లు తినే అలవాటు ఉంటుంది. అయితే వీటిని ఎక్కువగా మైదా పిండితో చేస్తారు. మైదా పిండిని పిల్లలకు ఇవ్వడం వల్ల వారికి మలబద్ధకం వచ్చే ప్రమాదం ఉందన నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు చిన్న వయస్సులోనే ఈ మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పిల్లలకు బిస్కెట్లు కంటే స్నాక్స్‌గా పోషకాలు ఉండే నువ్వుల లడ్డూ, వేరుశనగ లడ్డూ వంటివి ఇవ్వడం మంచిదని నిపుణులు అంటున్నారు.
చిప్స్
పిల్లలకు చిప్స్ అంటే చాలా ఇష్టం. వీటిని అసలు ఎక్కువగా పిల్లలకు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇందులో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లల ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎక్కువగా అసలు చిప్స్ పిల్లలకు ఇవ్వద్దు.
చాక్లెట్లు
చాక్లెట్లులో ఎక్కువగా పంచదార ఉంటుంది. అలాగే వాటిని పామాయిల్‌తో తయారు చేస్తారు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మధుమేహం వంటి సమస్యలు చిన్నవయస్సులోనే వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కూల్ డ్రింక్స్
పిల్లలకు సాఫ్ట్ డ్రింక్స్ అంటే చాలా ఇష్టం. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ డింక్స్‌లో ఎక్కువగా షుగర్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇందులో ఎలాంటి పోషకాలు కూడా ఉండవు. ఇవి శరీర ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలను కూడా చేకూర్చవు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Also Read: RailOne : రైల్వే ప్రయాణికులకు బంపర్ న్యూస్.. టికెట్, ఫుడ్.. అన్నీ ఒకే యాప్‌లో!