Foods: ఈ ఫుడ్స్ తీసుకుంటే.. ఎముకలు బలహీన పడటం గ్యారెంటీ

Foods: శరీరానికి పోషకాలు ఉండే ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే ఎముకలు బలహీన పడి అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అయితే డైలీ మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాల వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి. ఎముకలు బలహీనంగా మారితే.. బోలు ఎముకల వ్యాధి కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పోషకాలు లేని కొన్ని రకాల ఆహార పదార్థాలను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎముకలను బలహీనం చేసే ఆ పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
శీతల పానీయాలు
సీజన్‌తో సంబంధం లేకుండా కొందరు ఎక్కువగా శీతల పానీయాలు తాగుతుంటారు. వీటిని తాగడం వల్ల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఇందులోని ఫాస్పోరిక్ ఆమ్లం ఎముకలను బలహీనం చేస్తుంది. ఈ డ్రింక్స్ తాగడం వల్ల ఎముకల్లో కాల్షియం ఆటోమెటిక్‌గా తగ్గిపోతుంది. కాబట్టి వీటిని అసలు తాగవద్దు. తాగితే తప్పకుండా ఎముకల్లోని కాల్షియం అంతా కూడా తగ్గిపోతుంది.
ప్రాసెస్ చేసిన ఫుడ్
ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్ తింటున్నారు. వీటిని తినడం వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి. హోటల్‌లో వీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచి విక్రయిస్తున్నారు. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల అధికంగా యూరిక్ యాసిడ్ వస్తుంది. ఇది శరీరంలోని కాల్షియం శోషణను ప్రభావితం చేసి ఎముకలను బలహీనం చేస్తుంది. అదే వీటిని తినకుండా ఉంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
కేకులు
కేకులు, క్యాండీలు, కుకీలు వంటి తీపి వస్తువులను తినడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల శరీరంలో మంటగా అనిపిస్తుంది. ఇవి ఎముకలను బలహీనం చేస్తాయి. వీటిని ఎక్కువ కాలం షాపుల్లో నిల్వ ఉంచుతారు. అలాగే ఇందులో కొన్ని రంగులు వాడుతుంటారు. వీటి వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టీ
టీ ఆరోగ్యానికి మంచిదే. కానీ అధికంగా తీసుకుంటే మాత్రం ఇది ఎముకలను బలహీనం చేస్తుంది. ఎందుకంటే ఇందులోని కెఫిన్ ఎముకల ఆరోగ్యానికి ప్రమాదకరం. ఎక్కువగా కాఫీ లేదా టీ తీసుకోవడం వల్ల శరీరంలోని కాల్షియం తగ్గుతుంది. కాబట్టి టీని తీసుకోవడం తగ్గించండి.
మద్యం
మద్యం అధికంగా సేవించడం వల్ల శరీరంలో కాల్షియం శోషణ తగ్గుతుంది. దీనివల్ల ఎముకలు బలహీనంగా మారిపోతాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
ఆయిల్ ఫుడ్స్
సమోసా, ఫ్రైడ్ చికెన్, పకోడీలను ఎక్కువగా తీసుకోకూడదు. నూనె వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో మంట ఏర్పడుతుంది. దీనివల్ల కాల్షియం శోషణ పూర్తిగా తగ్గుతుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారుతాయి.
-
Health Tips: రోజంతా ఏం తినకపోయినా సరే ఆకలి అనిపించడం లేదా?
-
Health Tips: ఈ ఫ్రూట్ జూస్ లను మాత్రం అసలు కలిపి తీసుకోవద్దు..
-
Exercises: ఆఫీస్ లో కూర్చొనే ఈ వ్యాయామాలు చేయండి.
-
First Ultra Sound : గర్భధారణ సమయంలో మొదటి అల్ట్రాసౌండ్ ఎప్పుడు చేయాలి?
-
Health Tips : రోజుకు ఒకసారి అన్నం తింటే శరీరంలో ఈ మార్పులు పక్కా..
-
Health Tips : వీరు ఎండు చేపలు తింటే.. అంతే సంగతులు