Air Travel Tips : విమానంలో ఆందోళనను అధిగమించేందుకు 5 అద్భుత చిట్కాలు ఇవే!

Air Travel Tips : విమానంలో ప్రయాణించాలంటే కొందరికి తెలియని భయం, కంగారు మొదలవుతాయి. విమానం బయలుదేరే సమయం, గాలిలో వచ్చే కుదుపులు, లేదా సుదూర ప్రయాణాలు.. ఇవన్నీ మనసులో ఆందోళనను పెంచుతాయి. ముఖ్యంగా మొదటిసారి విమానం ఎక్కే వారికి లేదా ఇరుకైన ప్రదేశాలంటే భయం ఉన్న వారికి ఈ అనుభవం మరింత కష్టంగా అనిపించవచ్చు. ఈ కంగారును తగ్గించుకోవడానికి ప్రతిసారీ మందులు వేసుకోవాల్సిన పని లేదు. కొన్ని సహజమైన, సులభమైన పద్ధతులను పాటిస్తే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. మీ ప్రయాణాన్ని మరింత సుఖంగా మార్చుకోవచ్చు. విమానంలో కలిగే ఆందోళనను అదుపు చేయడానికి అలాంటి కొన్ని అద్భుతమైన సహజ పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆందోళన అంటే ఏదైనా పని చేయడానికి ముందు కలిగే కంగారు. కొంతమందికి విమానంలో కూర్చోవాలంటేనే ఈ ఆందోళన వస్తుంది. ‘హెల్త్‌లైన్’ అనే ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం..దాదాపు 40 శాతం మందికి విమాన ప్రయాణం అంటే ఆందోళన ఉంటుంది. ఇక 6.5 శాతం మందికి విమానం అంటేనే విపరీతమైన భయం (ఫోబియా) ఉంది. మీకు కూడా విమానంలో కూర్చోవాలంటే కంగారు అనిపిస్తే కొన్ని సహజ పద్ధతులతో దాన్ని తగ్గించుకోవచ్చు.
1. గట్టిగా శ్వాస తీసుకోవడం
విమానంలో కూర్చుని ఆందోళనగా అనిపించినప్పుడు ముక్కుతో నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకుని నోటితో వదలండి. దీనిని ‘4-7-8 శ్వాస పద్ధతి’ అని కూడా అంటారు. అంటే, 4 సెకన్లు శ్వాస తీసుకోవడం, 7 సెకన్లు ఊపిరిని పట్టి ఉంచడం, 8 సెకన్లలో నెమ్మదిగా వదలడం. ఈ పద్ధతి వల్ల మెదడుకు సరిపడా ఆక్సిజన్ అంది మీ నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది.
Read Also:Viral Video : వీడికి ఎన్ని గుండెలు.. 15అడుగుల కొండచిలువతో చిన్నారి ఆట
2. చెవులకు హాయినిచ్చే పాటలు
మీకు ఇష్టమైన ప్రశాంతమైన సంగీతం లేదా ధ్యానం పాటలు వినడం విమాన ప్రయాణ ఆందోళనను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. చెవిలో పెట్టుకునే హెడ్‌ఫోన్‌లతో వర్షం పడే శబ్దాలు, సముద్రపు అలల శబ్దాలు లేదా మెల్లని శాస్త్రీయ సంగీతం వంటివి వినండి. ఏ రకమైన సంగీతం ఇష్టమైతే అది వినడం మంచిది.
3. మూలికా టీ, సువాసనల మాయ
విమానంలో బయలుదేరడానికి ముందు లేదా విమానం ఎక్కాక (బోర్డింగ్ తర్వాత) కెమోమైల్ లేదా పుదీనా (పెప్పర్‌మింట్) లాంటి మూలికా టీ తాగడం శరీరాన్ని విశ్రాంతిని ఇస్తుంది. అలాగే, ఒక రుమాలుపై లావెండర్ ఆయిల్ కొన్ని చుక్కలు వేసి వాసన చూడడం వల్ల కూడా మానసిక ఒత్తిడి (టెన్షన్) తగ్గుతుంది.
4. పుస్తకాలు, కథలతో భయం దూరం
విమానంలో కూర్చున్నప్పుడు మనసు పదే పదే భయం వైపు వెళ్తుంటే, దానిని మరల్చడం చాలా ముఖ్యం. ఏదైనా తేలికపాటి పుస్తకం చదవండి లేదా మీకు ఇష్టమైన పాటలు, కథలు వినండి. దీనివల్ల మీ దృష్టి భయం నుండి మారుతుంది. ఆందోళన దానంతటదే తగ్గిపోతుంది.
Read Also:Viral Video : రీల్స్ పిచ్చితో రైలు పట్టాలపైనే బండికి నిప్పు.. పిచ్చి వదిలించిన పోలీసులు
5. సీటు సెలక్షన్
మీరు ఇరుకైన ప్రదేశాలంటే (క్లాస్ట్రోఫోబిక్) భయం ఉన్నట్లయితే కిటికీ పక్కన ఉన్న సీటును సెలక్ట్ చేసుకోవడం మంచింది. బయట చూడడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక, గాలిలో వచ్చే కుదుపులు (టర్బ్యులెన్స్) తక్కువగా అనిపించడానికి విమానం ముందు భాగంలో ఉండే సీట్లను సెలక్ట్ చేసుకోండి. అక్కడ కుదుపులు తక్కువగా ఉంటాయి. ఈ సహజ పద్ధతులను పాటించడం ద్వారా మీరు విమాన ప్రయాణాన్ని మరింత ప్రశాంతంగా, ఆనందంగా మార్చుకోవచ్చు.