Power of Silence : రోజుకు రెండు గంటలు నిశ్శబ్ధంగా ఉంటే ఎన్ని లాభాలో తెలుసా ?

Power of Silence : రోజురోజుకు పెరిగిపోతున్న హడావిడి, శబ్ద కాలుష్యంతో కూడిన జీవితంలో కాసేపు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా గడపడం చాలా అరుదైపోయింది. కానీ, ఇలా నిశ్శబ్దంగా (Silence) ఉండటం వల్ల మన ఆరోగ్యానికి, ముఖ్యంగా మన మెదడుకు ఎన్నో లాభాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆధునిక జీవనశైలిలో ఇది ఒక ముఖ్యమైన అలవాటుగా మారాలని వారు సూచిస్తున్నారు.
నిశ్శబ్దంతో మెదడుకు కొత్త జీవం
వైద్యుల సూచన ప్రకారం.. రోజుకు కనీసం రెండు గంటలు నిశ్శబ్దంగా కూర్చుంటే (Sitting in silence for 2 hours daily) మన మెదడులో (Brain) కొత్త కణాలు అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి (Memory Power) పెరుగుతుంది. కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు, మన భావోద్వేగాలు (Emotions) కూడా అదుపులో ఉంటాయి. నిశ్శబ్దం మన ఆలోచనా శక్తిని మెరుగుపరుస్తుంది.
Read Also:Wifes Do This For Husband: భార్యలు ఈ పరిహారం చేస్తే.. భర్తలకు విజయం తథ్యం
డిజిటల్ పరికరాల వాడకం
ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువసేపు ఫోన్లు (Phones), ల్యాప్‌టాప్‌లు (Laptops) వంటి డిజిటల్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల మెదడుకు ఎలాంటి విశ్రాంతి దొరకదని, క్రియేటివ్ ఆలోచనలు రావడం కష్టమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిరంతరం శబ్దాలు, సమాచారం మెదడును అలసిపోయేలా చేస్తాయి. కాసేపు నిశ్శబ్దంగా ఉండడం వల్ల మెదడుకు విశ్రాంతి లభించి, అది కొత్త ఆలోచనలను, పరిష్కారాలను కనుగొనడానికి సహాయపడుతుంది.
మానసిక ప్రశాంతతకు నిశ్శబ్దం
నిశ్శబ్ద వాతావరణం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఒత్తిడి (Stress), ఆందోళన (Anxiety) వంటివి తగ్గుతాయి. అంతర్గత ప్రశాంతతను పెంచుకోవడానికి నిశ్శబ్దం చాలా అవసరం. అందుకే, రోజులో కొంత సమయాన్ని నిశ్శబ్దంగా గడపడం, ధ్యానం (Meditation) చేయడం వంటివి అలవర్చుకోవడం మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also:World Brain Tumor Day : ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్‌ను ఎలా గుర్తించాలి? – నిపుణుల సలహాలు!