Brain Health: స్క్రీన్ ను ఎక్కువ చూస్తే.. మెదడుపై పని ఒత్తిడి
Brain Health 25 నుంచి 45 ఏళ్ల వారు దాదాపు 30 శాతం మంది ఉంటారని తెలిపారు. ప్రస్తుతం మహిళల్లో కూడా ఈ సమస్య కనిపిస్తోందని, ఒత్తిడి, మధుమేహం, రక్తపోటు కారణాలతో మహిళల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

Brain Health: డిజిటల్ ఓవర్ లోడింగ్, నిరంతరం స్క్రీన్ లను చూడటం మెదడు పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇటీవల యువత ఈ సమస్యను ఎక్కువ ఎదుర్కొంటుందని డాక్టర్లు తెలిపారు. ఇటీవల హైదరాబాద్ లో ఆస్పత్రులకు వచ్చే బాధితుల్లో 25 శాతం మంది ఉంటున్నారు. ప్రతీ రోజు ఓపీకి 60 మంది వస్తే వీరిలో 20 మంది ఈ తరహా సమస్యలో ఉంటున్నారని తెలిపారు.
ఇందులో 25 నుంచి 45 ఏళ్ల వారు దాదాపు 30 శాతం మంది ఉంటారని తెలిపారు. ప్రస్తుతం మహిళల్లో కూడా ఈ సమస్య కనిపిస్తోందని, ఒత్తిడి, మధుమేహం, రక్తపోటు కారణాలతో మహిళల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు నింద్రపోవడం సమృద్ధిగా ఆహారం తీసుకోవాలి. స్క్రీన్ లను చూడట తగ్గించాలి. పిల్లలు స్క్రీన్ ను ఎక్కువ సేపు చూస్తే కంటి సమస్యలు వస్తాయి. మాట్లాడే నైపుణ్యాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.