Wifes Do This For Husband: భార్యలు ఈ పరిహారం చేస్తే.. భర్తలకు విజయం తథ్యం

Wifes Do This For Husband: ప్రతీ భార్య కూడా తన భర్త కోరుకున్న పనులు అన్ని కూడా జరగాలని భావిస్తారు. ముఖ్యంగా బయటకు వెళ్లిన తర్వాత భర్త చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు విజయం సాధించాలని అనుకుంటారు. అయితే కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. భర్త సంతోషంగా ఉండాలన్నా, ఆర్థికంగా బాగా ఉండాలన్నా, చేసే పనుల్లో విజయం సాధించాలన్నా ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా కొన్ని పరిహారాలు పాటించాలని పండితులు అంటున్నారు. భర్త రోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని మంచి అలవాట్లను పాటిస్తే ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రశాంతంగా ఉంటుంది. భర్త చేపట్టిన పనులు సులభంగా పూర్తవుతాయి. అయితే భర్తలు బయటకు వెళ్లినప్పుడు భార్యలు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం.
పాలు, బెల్లం
పాలు, బెల్లానికి హిందూ ధర్మంలో చాలా ప్రాధాన్యత ఉంది. మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఒక గ్లాసు పాలల్లో కొద్దిగా బెల్లం కలిపి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనం లభిస్తుందని, జీవితంలో సంతోషాలు ఉంటాయని నమ్ముతారు. మీ భర్త చేసే పనుల్లో విజయం సాధించగలరని కూడా చెబుతారు.
తీయటి పండ్లు
అరటి పండ్లు, ఆపిల్ పండ్ల వంటి తీయటి పండ్లను మీ భర్త బయటకు వెళ్లే ముందు తినిపించండి. ముఖ్యంగా అరటి పండ్లు విష్ణుమూర్తికి చాలా ఇష్టం. కాబట్టి వాటిని ఇవ్వడం వల్ల మానసికంగా ప్రశాంతత లభిస్తుందని, శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. ఇది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది.
కాయిన్స్ లేదా డబ్బులు
భర్త పని మీద బయటకు వెళ్తున్నప్పుడు మీరు ఒక కాయిన్ లేదా కొంత డబ్బును ఇవ్వాలి. ఇలా చేస్తే మంచి జరగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ధనం ప్రవాహం ఏర్పడుతుందని నమ్ముతారు. ఇది ఒక రకమైన శుభ సూచకంగా భావిస్తారు. ఇది భర్తలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.
నుదుటిపై తిలకం
మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు నుదుటిపై తిలకం పెట్టండి. బొట్టు పెట్టడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది. చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని, విజయం వరిస్తుందని నమ్ముతారు. ఇది ఒక రకమైన రక్షణగా కూడా భావిస్తారు.
Read Also:World Brain Tumor Day : ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్‌ను ఎలా గుర్తించాలి? – నిపుణుల సలహాలు!
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Life Lessons: లైఫ్ ఎండ్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారా.. ఈ స్టోరీ వినండి మీకోసమే!
-
Puja: అబ్బాయిలు పూజలు చేస్తే ఏమవుతుందో తెలిస్తే.. డైలీ ఇంట్లో మీరే ఇక పంతులు
-
Tholi Ekadasi: ఏ సమయంలో తొలి ఏకాదశి నాడు పూజిస్తే మంచిదో మీకు తెలుసా?
-
Tholi Ekadasi: పాపాల నుంచి విముక్తి పొందాలా.. తొలి ఏకాదశి నాడు ఇలా చేస్తే చాలు
-
Business Vastu Tips: ఏ వ్యాపారం ప్రారంభించినా నష్టపోతున్నారా.. ఈ వాస్తు నియమాలు పాటిస్తే ఇక లాభమే!
-
Mirror: ఇంట్లో ఇక్కడ అద్దం పెడితే.. ఇళ్లంతా డబ్బు మయం