South Korea : ఇదిగో ఈ కారణాలే సౌత్ కొరియాను ప్రపంచంలో “అందంగా” నిలబెట్టాయి..
South Korea : అందమైన ఆడపిల్లలు.. నదిలో నీటి సవ్వడులు.. వాటి మీద పున్నమి చంద్రుడి హొయలు.. మాటలకందని భావాలు.. భావుకత్వానికి.. రస రమ్యత్వానికి ఇంతకు మించిన కవితా వస్తువులు ఏముంటాయి" వెనకటికి ఓ కవి రాసిన పలుకులు ఇవి.

South Korea : అందమైన ఆడపిల్లలని తలుచుకుంటే కవిత్వం దానంతట అదే వస్తుందని.. రస రమ్యత్వం దానంతట అదే కలుగుతుందని.. మాటలకందని భావాలు వెంటనే సిద్ధిస్తాయని.. ఆ కవి వర్యుడు విన్నవించాడు.. నిజమే ప్రపంచంలో అందాన్ని వర్ణించాలంటే.. అందాన్ని ఉపమానించాలంటే.. అందాన్ని కొలమానించాలంటే అది ఆడపిల్లలతోనే.. దేవరకొండ బాలగంగాధర తిలక్ లాంటి కవులు.. ” నా కవితా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు” అని రాశారంటే.. ఆడపిల్లలకు అందానికి ఎటువంటి సంబంధం ఉంటుందో ఇట్టే చెప్పొచ్చు.అందం విషయంలోనే కాదు శారీరక దృఢత్వంలో.. మానసిక పరిపక్వతలో.. కష్టించి పనిచేసే తీరులో మగవారి కంటే ఆడపిల్లలు పది మెట్లు పైనే ఉంటారు. ఎందుకంటే వారి శరీర నిర్మాణం ఆ విధంగా ఉంటుంది కాబట్టి..
అందమైన అమ్మాయిలు అక్కడే ఉన్నారు..
అందాన్ని, అమ్మాయిలను వేర్వేరుగా చూడలేం. అది దాదాపు అసాధ్యం కూడా. రమణీయతను పెంచుకున్న ప్రకృతి మాదిరిగానే.. ఆడవాళ్లు కూడా రస రమ్యతతో దర్శనమిస్తారు. ఇక ఇన్ సైడర్ మంకీ (insider monkey) అనే ఒక సంస్థ ప్రపంచవ్యాప్తంగా అందమైన అమ్మాయిలు ఉన్న దేశాలపై ఒక సర్వే నిర్వహించింది. అందులో టాప్ -50 దేశాల జాబితాను విడుదల చేసింది. ఇందులో దక్షిణకొరియా(South Korea) మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బ్రెజిల్(Brazil), అమెరికా(America), జపాన్(Japan), మెక్సికో(Mexico), జర్మనీ(Germany), కొలంబియా(Columbia), థాయ్ లాండ్(Thailand), ఇటలీ(Italy), వెనీజులా(Venezuela) దేశాలు నిలిచాయి. ఈ జాబితాలో ఇండియా 18వ స్థానంలో నిలిచింది. “సౌత్ కొరియా అమ్మాయిలు అందంగా ఉంటారు. వినూత్నంగా ఆలోచించడంలో.. స్వతంత్రంగా బతకడంలో.. అధునాతన సాంస్కృతిని ప్రతిబింబించడంలో.. తమ సంప్రదాయాలను కాపాడుకోవడంలో ముందు వరుసలో ఉంటారు. అందువల్లే వారు ప్రపంచంలో అందమైన అమ్మాయిలు గుర్తింపు పొందారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే వారు బతకగలరు. పైగా ఉన్న జీవిత కాలాన్ని ఆస్వాదిస్తూ గడుపుతారని” ఇన్ స్పైడర్ మంకీ తన నివేదికలో వెల్లడించింది.
వారి జన్యువులే అలా ఉంటాయి
దక్షిణ కొరియా ఆసియా ఖండంలో ప్రధాన దేశాలలో ఒకటి. ఉత్తరకొరియా, దక్షిణ కొరియా, జపాన్, థాయిలాండ్, బ్యాంకాక్ వంటి దేశాలలో ఎక్కువగా ప్రజలు తెల్లని చర్మం కలిగి ఉంటారు. దక్షిణ కొరియా అమ్మాయిలు కూడా తెలుపు వర్ణంతో కనిపిస్తుంటారు.ఉత్తరకొరియా, దక్షిణ కొరియా, జపాన్, థాయిలాండ్, బ్యాంకాక్ వంటి దేశాల ప్రజలతో పోల్చి చూస్తే.. దక్షిణ కొరియా ప్రజలు భిన్నంగా ఉంటారు. అందువల్లే అక్కడి అమ్మాయిలు ప్రపంచంలోనే అత్యంత అందమైన వారిగా గుర్తింపు పొందారు. తెలివి.. నేర్చుకోవాలనే తత్వం.. ఓపిక.. క్షమాగుణం వంటి వాటిల్లో కూడా దక్షిణ కొరియా అమ్మాయిలు ముందు వరుసలో ఉన్నారు. ఇవన్నీ కూడా వారిని ప్రపంచంలోనే అందమైన అమ్మాయిలుగా గుర్తింపు పొందేలా చేశాయి.