Pope Francis: బౌన్సర్ నుంచి క్యాథలిక్ చర్చి వరకు.. పోప్ రియల్ నేమ్ ఇదే
ప్రపంచ క్యాథలిక్ చర్చి అధినేత పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో 88 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు. ఈస్టర్ తర్వాత రోజే పోప్ మృతి చెందారు. ఈ విషయాన్ని వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది. అయితే పోప్ ఫ్రాన్సిస్ గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు.

Pope Francis: ప్రపంచ క్యాథలిక్ చర్చి అధినేత పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో 88 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు. ఈస్టర్ తర్వాత రోజే పోప్ మృతి చెందారు. ఈ విషయాన్ని వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది. అయితే పోప్ ఫ్రాన్సిస్ గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల డబుల్ న్యుమోనియా కూడా వచ్చింది. ఇక అప్పటి నుంచి పోప్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. పోప్ ఫ్రాన్సిస్ ఒక సాధారణమైన వ్యక్తి. అలాంటిది ఒక పోప్‌గా ఎలా ఎదిగారు? అసలు ఇతని ప్రస్థానం ఏంటి? రియల్ నేమ్ ఏంటి? పూర్తి వివరాలు కూడా తెలియాలంటే మీరు స్టోరీ మొత్తం చదవాల్సిందే.
Read also: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాక్‌టెయిల్.. ధర ఎంతో తెలిస్తే షాక్ కావాల్సిందే
పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. ఇతను 1936 డిసెంబర్ 17న జన్మించారు. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో పోప్ పుట్టారు. వీరి తల్లిదండ్రులు ఇటలీ నుంచి వలస వచ్చారు. మారియో జోస్ బెర్గోగ్లియో, రెజీనా మరియా సివోరి దంపతులకు మొత్తం ఐదుగురు సంతానం. అందుతూ పోప్ పెద్దవారు. ఇతని తండ్రి ఒక అకౌంటెంట్. అయితే జార్జ్ మారియో ఒక క్రైస్తవ మతగురువుగా మారడానికి ముందు ఎన్నో ఉద్యోగాలు చేశారు. నైట్ క్లబ్‌లో బౌన్సర్‌గా వర్క్ చేయడం, స్కూల్‌లో స్వీపర్‌గా చేయడం, రసాయన ప్రయోగశాలలో టెక్నీషియన్‌గా కూడా పనిచేశారు. అలాగే క్లీన్ చేయడం, హై స్కూల్‌లో బోధించడం వంటివి కూడా చేశారు. ఇలా ఎన్నో పనులు చేస్తూ.. చివరకు ఒక పోప్‌గా మారారు. అలాగే పోప్ బెర్గోగ్లియో కెమిస్ట్రీ చదివి.. టెక్నికల్ డిప్లొమో చదివారు. ఆ తర్వాత ఓ మత గురువుతో జరిగిన సన్నివేశం తనని ఎంతగానో మార్చేసింది. పోప్ జెస్యూట్ ఆర్డర్‌లో మతగురువుగా 1969 డిసెంబర్ 13న దీక్ష పొందారు. ఆ తర్వాత ప్రొవిన్షియల్ సుపీరియర్‌గా నాయకత్వం వహించారు.
Read Also: కలలో ఇవి కనిపిస్తే.. కోరుకున్న ఉద్యోగం రావడం ఖాయం
పోప్ ఫ్రాన్సిస్ అమెరికా ఖండాల నుంచి ఎన్నికైన మొదటి పోప్ కూడా ఇతనే. అలాగే జెస్యూట్ ఆర్డర్ నుంచి పోప్ పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి కూడా పోప్‌నే. దీంతో పాటు ఫ్రాన్సిస్ పేరును స్వీకరించిన మొదటి పోప్ కూడా ఇతనే. ఫ్రాన్సిస్ అనే పేరును ఎంచుకోవడం వెనుక కారణాలు కూడా ఉన్నాయి. పోప్ వినయం, కరుణ, సేవ పట్ల అతనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా కూడా ఈ పేరును ఎంచుకున్నారని చెబుతారు. అయితే పోప్ 2013లో ఎన్నికయ్యారు. దీని కంటే ముందుగా అతను కార్డినల్ జార్జ్ మారియో బెర్గోగ్లియోగా బ్యూనస్ ఎయిర్స్ ఆర్చ్ బిషప్‌గా ఎన్నో సేవలు కూడా అందించారు. అయితే కొన్ని శతాబ్దాల తర్వాత ఐరోపాయేతర ప్రాంతం నుంచి ఎన్నికైన మొదటి పోప్ కూడా ఫ్రాన్సిస్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే పోప్ మృతి క్యాథలిక్ సమాజానికి తీరని లోటు. ఇతని మృతికి ప్రపంచ వ్యాప్తంగా సంతాపం తెలియజేస్తున్నారు.