Lemon water: ఈ సీజన్‌లో రోజూ నిమ్మరసం తాగడం మంచిదేనా? తాగితే ఏమవుతుంది?

Lemon water:
వేసవిలో ఎక్కువగా పండ్ల రసాలు, జ్యూస్‌లు వంటివి తాగుతారు. వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండ తీవ్రత నుంచి వెంటనే ఎనర్జీ వస్తుంది. అయితే చాలా మంది వేసవిలో నిమ్మ రసానికి ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని భావిస్తారు. నిజానికి నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంది. మీరు వేసవిలో డైలీ తీసుకుంటే మంచిదే. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే ఎలాంటి నీరసం, అలసట ఉండదు. అయితే నిమ్మరసం ఎక్కువగా తాగకూడదు, తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కేవలం నిమ్మరసాన్ని కేవలం మోతాదులో మాత్రమే తీసుకోవాలి. లేకపోతే అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజులో ఎక్కువసార్లు కాకుండా రోజుకి ఒకసారి వేసవిలో నిమ్మరసం తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో నిమ్మరసం బాగా పనిచేస్తుంది. దాహాన్ని తీర్చడంతో పాటు వేసవిలో ఎనర్జీటిక్‌గా ఉండేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు.
ఇన్ఫెక్షన్లు రాకుండా
నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగినిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని డైలీ తాగడం వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, జ్వరం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
జీర్ణక్రియ
నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. తీసుకున్న ఆహారం ఈజీగా జీర్ణం అవుతుంది. అలాగే గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. అయితే రోజుకి ఒకసారి తీసుకుంటే ఎలాంటి ప్రమాదం లేదు. కానీ రోజులో ఎక్కువసార్లు నిమ్మరసం తీసుకుంటే మాత్రం తప్పకుండా అనారోగ్య సమస్యల బారిన పడతారు.
బాడీకి చలవ
వేసవిలో నిమ్మరసం కలుపుకుని డైలీ తాగడం వల్ల బాడీ డీహైడ్రేషన్‌కు గురి కాదు. బాడీ హైడ్రేట్‌గా ఉండి.. మూత్రపిండాల వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. అలాగే శరీరానికి శక్తిని కల్పిస్తుంది.
బరువు తగ్గడం
ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటివల్ల జీవక్రియ మెరుగుపడి మీరు ఈజీగా బరువు తగ్గుతారు. అందులోనూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు.
చర్మ ఆరోగ్యం
నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిపించడంలో బాగా సాయపడతాయి. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలను తగ్గించడంలో నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. స్కిన్ క్లియర్‌గా ఉండి ముఖం మెరుస్తుంది. ఎలాంటి మచ్చలు, మొటిమలు కూడా ముఖంపై ఉండవు. ముఖం చూడటానికి చాలా క్లియర్‌గా ఉంటుంది. అయితే నిమ్మరసంలో కొందరు పంచదార వేస్తారు. కానీ ఇలా వేసి తాగితే మీకు ఎలాంటి ఫలితాలు ఉండవు. షుగర్ లేకుండా నిమ్మరసం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి ఫలితం ఉంటుంది.