Water Melon: ఎరుపు రంగు కంటే ఈ కలర్ పుచ్చకాయలు తింటే.. బోలెడన్నీ ప్రయోజనాలు

Water Melon:
వేసవి వస్తుందంటే చాలా మంది ఎక్కువగా పుచ్చకాయను తింటారు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వేసవిలో బాడీ డీహైడ్రేట్ కాకుండా కాపాడతాయి. అయితే మనలో చాలామంది ఎరుపు రంగు ఉండే పుచ్చకాయలు గురించే ఎక్కువగా తెలుసు. కానీ పుసుపు రంగులో ఉండే పుచ్చకాయ గురించి పెద్దగా తెలియదు. ఎరుపు పుచ్చకాయ కంటే పసుపు రంగులో ఉండే వాటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. ఇవి ఇండియాలో కాకుండా విదేశాల్లో ఎక్కువగా పండుతాయి. ఫస్ట్ ఈ పసుపు పుచ్చకాయలను ఆఫ్రికాలో పండించారు. ఆ తర్వాత యూరప్, అమెరికా, చైనాలో పండించారు. అయితే ప్రస్తుతం రాజస్థాన్‌లో కూడా వీటిని పండిస్తున్నారు. ఎందుకంటే ఇవి నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెరగవు. రాజస్థాన్, గుజరాత్‌లో ఎక్కువగా ఎడారులు ఉంటాయి. ఇక్కడే ఇవి బాగా పండుతాయి. సాధారణంగా పుచ్చకాయ అంటే ఎరుపు రంగులో ఉంటుంది. కానీ ఇందులో లైకోపీన్ అనే రసాయనం ఉండటం వల్ల పసుపు రంగులో పుచ్చకాయ ఉంటుంది. అయితే ఈ పసుపు పుచ్చకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
కళ్లు ఆరోగ్యం
పసుపు పుచ్చకాయలో ఎక్కువగా బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కళ్ల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కళ్ల సమస్యలు రాకుండా కాపాడుతుంది. అలాగే బరువు తగ్గేలా చేస్తుంది. ఎరుపు పుచ్చకాయతో పోలిస్తే పసుపు పుచ్చకాయలో ఎక్కువగా కేలరీలు ఉంటాయి. ఇవి బరువు తగ్గేలా చేస్తాయి.
రక్తప్రసరణ
దీంట్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల అధిక రక్త పోటు నుంచి విముక్తి కలుగుతుంది.
కొలెస్ట్రాల్
ఈ పసుపు పుచ్చకాయలో ఎక్కువగా డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలోని ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను బాగా తగ్గిస్తుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. కాబట్టి ఎరుపు కంటే పసుపు పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిది.
చర్మ ఆరోగ్యం
పసుపు పుచ్చకాయలు తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు చర్మాన్ని మెరిపిస్తాయి. అయితే ఈ పుచ్చకాయను మధుమేహం ఉన్నవారు మితంగానే తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులోని తీపి చక్కెర స్థాయిలను పెంచుతుందని నిపుణులు అంటున్నారు.
బాడీ హైడ్రేట్
వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీనివల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. వేసవిలో ఎక్కువగా బాడీ డీహైడ్రేషన్‌కు గురి అవుతుంది. దీనివల్ల నీరసం, అలసట వంటి సమస్యలు వస్తాయి. అదే పసుపు పుచ్చకాయను తినడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.