Water Melon: కల్తీ పుచ్చకాయను గుర్తించడం ఎలాగంటే?

Water Melon:
వేసవిలో పుచ్చకాయలు ఎక్కువగా లభిస్తాయి. ఇలాంటి మండుటెండలో వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటారు. ముఖ్యంగా బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. వేసవిలో బాడీ ఎక్కువ వేడికి గురవుతుంది. అదే పుచ్చకాయను తినడం వల్ల బాడీకి చలవ చేస్తుంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ట్యాన్ నుంచి విముక్తి కల్పించడంతో పాటు ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా పుచ్చకాయలను తినడానికి ఇష్టపడతారు. వేసవిలో వీటికి డిమాండ్ కూడా భారీగానే ఉంటుంది. అయితే ప్రస్తుతం అన్నింట్లో కూడా కల్తీ జరుగుతోంది. మనం తినే ప్రతీ ఫుడ్‌లో రసాయనాలు ఉంటున్నాయి. డబ్బుల కోసం వీటినే ఎక్కువగా వాడుతున్నారు. అయితే వేసవిలో ఎక్కువగా తినే ఈ పుచ్చకాయలను కూడా కల్తీ చేస్తున్నారు. తొందరగా పండితే విక్రయించవచ్చనే ఉద్దేశంతో కల్తీ చేస్తున్నారు. ముఖ్యంగా పుచ్చకాయలు ఎర్రగా కనిపించడానికి ఇంజెక్షన్లు చేయడం, ఆర్టిఫిషియల్ రంగులు వంటివి వాడుతున్నారు. అయితే పుచ్చకాయ కల్తీ అయ్యిందో లేదో అనే విషయం మీరు తెలుసుకోవాలంటే చిన్న చిట్కా పాటించాల్సిందే.
పుచ్చకాయను మధ్యలో కోసి దానిపై టిష్యూతో గట్టిగా అంటిపెట్టాలి. ఆ టిష్యూకి రెడ్ కలర్‌లో ఏదైనా అంటితే మాత్రం ఆ పుచ్చకాయ కల్తీది అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పుచ్చకాయ ఎర్రగా పండటానికి దానికి ఇంజెక్షన్ వేస్తారు. దీనివల్ల అది ఎర్రగా మారుతుంది. అలాగే పుచ్చకాయకి సాధారణ ఎరుపు కాకుండా అధిక మొత్తంలో బాగా ఎర్రగా కనిపిస్తే మాత్రం అది కూడా కల్తీ అయ్యిందనే అర్థం చేసుకోవాలి. కొన్ని పుచ్చకాయలకు అక్కడక్కడా పసుపు మచ్చలు ఉంటాయి. వీటిపైన ఇంజెక్షన్ చేయడం వల్ల ఇలా అవుతాయి. ఇవి తొందరగా పండటానికి వీటిపైన కార్బైడ్ కెమికల్‌ను చల్లుతారు. దీనివల్ల అవి ఎర్రగా, తొందరగా పండుతాయి. ఇలా మీకు పుచ్చకాయపై కనిపిస్తే వాటిని ఉప్పుతో కడిగి తినాలి. కడగకుండా అయితే అసలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎర్రగా ఉండటానికి కొందరు ఇంజెక్షన్లు వేస్తారు. ఇలాంటి పుచ్చకాయను తినడం వల్ల నాలుక కూడా ఎర్రగా మారుతుంది. మీరు తిన్న తర్వాత ఇలా మారితే అది కల్తీ పుచ్చకాయ అని గుర్తించండి.
పుచ్చకాయలో ఎక్కువగా బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కళ్ల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కళ్ల సమస్యలు రాకుండా కాపాడుతుంది. అలాగే బరువు తగ్గేలా చేస్తుంది. పుచ్చకాయలో ఎక్కువగా కేలరీలు ఉంటాయి. ఇవి బరువు తగ్గేలా చేస్తాయి. దీంట్లో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల అధిక రక్త పోటు నుంచి విముక్తి కలుగుతుంది. పుచ్చకాయలోని డైటరీ ఫైబర్ శరీరంలోని ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను బాగా తగ్గిస్తుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.