Jr NTR: సన్నబడేందుకు ఎన్టీఆర్ ఇంజెక్షన్స్ వాడారా? మరీ తక్కువ రోజుల్లోనే ఎలా?
జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బొద్దుగా అందంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చాలా బరువు తగ్గారు. ఇటీవల కొన్ని ఈవెంట్లలో సన్నగా కనిపించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ ఒక్కసారిగా ఇలా ఎందుకు సన్నపడుతున్నారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గతంలో కంటే ఇప్పుడు చాలా సన్నగా కనిపిస్తున్నారని నెట్టింట ఫ్యాన్స్ హల్‌చల్ చేస్తున్నారు. అసలు ఇంత సడెన్‌గా ఎన్టీఆర్ సన్నం ఎలా అయ్యారని.. ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా అడుగుతున్నారు. మరికొందరు ఎన్టీఆర్ ఒజెంపిక్ అనే ఇంజెక్షన్ తీసుకుంటున్నట్లు అంటున్నారు. ఈ ఇంజెక్షన్ వల్లే ఎన్టీఆర్ చాలా తొందరగా వెయిట్ లాస్ అయ్యారని అంటున్నారు. అసలు ఇందులో నిజమేది? ఎన్టీఆర్ తీసుకుంటున్నారనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో వాస్తవం ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Read Also: బియ్యం వాటర్‌తో ఫేస్ గ్లో.. ఎలాగంటే?
ఎన్టీఆర్ కొత్త డైట్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఒక్కసారిగా బరువు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. బరువు తగ్గడానికి ఒజెంపిక్ వంటి ఇంజెక్షన్ వాడడం లేదని తెలుస్తోంది. అయితే ప్రశాంత్ నీల్ చిత్రం కోసం ఎన్టీఆర్ లుక్ మారుస్తున్నారని, అందుకోసం డైట్‍లో మార్పులు చేసుకున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్‌తో తీసే సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్టీఆర్ బరువు తగ్గినట్లు సమాచారం. అయితే సినిమా కూడా ఎన్టీఆర్ సన్నగా ఉండాలని, ఆ రూల్‌కి ఇలానే ఉండాలనే ఉద్దేశంతో బాగా సన్నబడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ దీనిపై ఏదైనా అప్డేట్ ఇస్తేనే క్లారిటీ వస్తుంది. ఏదైనా కూడా ఎన్టీఆర్ బొద్దుగా ఉంటేనే అందంగా కనిపిస్తారు. అంతే కానీ ఇలా సన్నగా ఉంటే అసలు అందంగా కనిపించరు.
Read Also: ఈ వస్తువులను ఫ్రిడ్జ్‌పై పెట్టారో.. మీకు సమస్యలు తప్పవు
ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తో తదుపరి సినిమా చేయనున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించి కొన్ని సీన్ల షూటింగ్ కూడా జరిగింది. అయితే ఎన్టీఆర్ ఈ నెల చివరిలో షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉంటాయట. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ మూవీలో ఎన్ని యాక్షన్ సీన్లు ఉంటాయో తెలిసిన విషయమే. ఇలానే ఎన్టీఆర్ మూవీలో కూడా యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉంటాయట.Jr NTR: సన్నబడేందుకు ఎన్టీఆర్ ఇంజెక్షన్స్ వాడారా? మరీ తక్కువ రోజుల్లోనే ఎలా?Jr NTR: సన్నబడేందుకు ఎన్టీఆర్ ఇంజెక్షన్స్ వాడారా? మరీ తక్కువ రోజుల్లోనే ఎలా?
-
Zodiac Signs: అక్షయ తృతీయ నుంచి ఈ రాశుల వారికి పట్టింది బంగారమే
-
Lizards: ఈ చిట్కాలు పాటిస్తే.. ఇంట్లో బల్లులు పరార్
-
Pressure Cooker: ప్రెషర్ కుక్కర్లో ఇవి కుక్ చేస్తున్నారా.. మీరు పైకి పోవడం ఖాయం
-
Electric Car: 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు అదిరిపోయింది.. చూస్తే కొనకుండా ఉండలేరు
-
Zodiac Signs: ప్రేమ విషయంలో ఈ రాశుల వారంతా అదృష్టవంతులు ఎవరూ లేరు భయ్యా
-
Rahu and Ketu: రాహు కేతువుల మార్పు.. వీరికి ఇక తిరుగే లేదు