Neer Mahal : సరస్సు మధ్యలో సుందరమైన ప్యాలెస్.. ఎక్కడ ఉందో తెలుసా ?

Neer Mahal : మన భారతదేశం ఎన్నో అద్భుతమైన, చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి. అలాంటి కట్టడాల్లో ఒకటి ‘నీర్ మహల్’. ఈ మహల్ త్రిపుర రాష్ట్రంలో ఉంది. పేరులోనే ఉన్నట్లుగానే ఇది నీళ్ల మధ్యలో నిర్మించిన ఒక అందమైన ప్యాలెస్. రుద్రసాగర్ సరస్సు మధ్యలో ఇది చూడముచ్చటగా కనిపిస్తుంది. పూర్తిగా ఎరుపు రంగు ఇసుకరాళ్ళు సాండ్స్టోన్, తెల్లటి పాలరాయితో దీన్ని నిర్మించారు. దూరం నుంచి చూస్తే ఇది నిజంగానే ఒక కళాఖండంలా కనబడుతుంది.
ఈ నీర్ మహల్, త్రిపుర రాజధాని అగర్తలాకు దాదాపు 53 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ గారికి దుద్రసాగర్ సరస్సు మధ్యలో ఒక ప్యాలెస్ నిర్మించాలనే కోరిక ఉండేదట. ఆ కోరికతోనే ఆయన దీన్ని కట్టించారు. ఈ మహల్ నిర్మాణానికి ఏకంగా తొమ్మిదేళ్లు పట్టింది. 24 గదులు ఉండే ఈ ప్యాలెస్ దూరం నుంచి చూస్తే ఒక అద్భుతమైన గోపురంలా కనిపిస్తుంది. ఇక్కడ అందమైన గార్డెన్స్, వాటర్ ఫౌంటైన్లు కూడా ఉంటాయి.
Read Also:Harrier EV : హారియర్‌లో ఉన్న ఈ 5 ఫీచర్లు మరే ఎలక్ట్రిక్ కార్లలో లేవు.. టాటా అద్భుతం
పగలు ఒక రకంగా అందంగా ఉంటే, రాత్రి సమయంలో ఈ భవనాన్ని చూస్తే అసలు సిసలు అందం బయటపడుతుంది. నీటిపై దీని ప్రతిబింబం పడి, చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ మహల్‌ను హిందూ, ముస్లిం నిర్మాణ శైలి రెండూ కలిపి నిర్మించారు. అందుకే దీనిలో రెండు సంస్కృతుల కళాఖండాలు కనిపిస్తాయి. ఈ ప్యాలెస్‌ను సందర్శించడం ద్వారా త్రిపుర సంస్కృతి, కళా నైపుణ్యాన్ని దగ్గరగా చూసే అవకాశం లభిస్తుంది.
నీర్ మహల్‌కు ఎలా చేరుకోవాలి?
త్రిపుర రాజధాని అగర్తలాకు రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నీర్ మహల్‌కు వెళ్లొచ్చు. అగర్తలాలో ఎయిర్ పోర్టు ఉంది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి ఇక్కడికి విమానాలు ఉంటాయి. అగర్తలా నుంచి ప్రభుత్వ బస్సులు, ప్రైవేట్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. రుద్రసాగర్ సరస్సు వరకు వెళ్లి, అక్కడ బోటు ద్వారా ప్యాలెస్‌కు చేరుకోవచ్చు. బోటు ప్రయాణం కూడా ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది.
Read Also:Harrier EV : హారియర్‌లో ఉన్న ఈ 5 ఫీచర్లు మరే ఎలక్ట్రిక్ కార్లలో లేవు.. టాటా అద్భుతం
నీర్ మహల్‌తో పాటు త్రిపురలో చూడదగ్గ మరికొన్ని పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఉజ్జయంత ప్యాలెస్ ఇది అగర్తలాలో ఉన్న మరో అందమైన ప్యాలెస్. ఇది గతంలో త్రిపుర రాజుల నివాసం. దీంతో పాటు సిపాహిజలా వన్యప్రాణి అభయారణ్యంలో వివిధ రకాల పక్షులు, జంతువులను చూడొచ్చు.