Pahalgam Mastermind Suleman: పహల్గామ్ సూత్రధారి సులేమాన్ మూసా హతం
Pahalgam Mastermind Suleman రత సైన్యంతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు బృందాలు ఆపరేషన్ మహాదేవ్ లో పాల్గొన్నాయి.

Pahalgam Mastermind Suleman: పహల్గామ్ లో మరణహోమం సృష్టించి ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం అంతం చేసింది. పక్కా ప్రణాళికతో భారత్ సైన్యం సోమవారం ఆపరేషన్ చేపట్టింది. శ్రీనగర్ లో దట్టమైన అడవి లో తలదాచుకున్న ఉగ్రవాదుల జాడను పసిగట్టింది. సంచార జాతుల వారు ఇచ్చిన పక్కా సమాచారంతో ఆపరేషన్ మహాదేవ్ ప్రారంభించింది.
భారత సైన్యంతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు బృందాలు ఆపరేషన్ మహాదేవ్ లో పాల్గొన్నాయి. శ్రీనగర్ లోని హర్వాన్ ప్రాంతంలోని డాచిగామ్ అటవీ ఎగువ ప్రాంతంలో ఉగ్రవాదుల కదిలికను ముందుగా కనిపెట్టి.. చాకచక్యంగా ముగ్గురు ఉగ్రవాదులను భారత దళాలు ముట్టబెట్టాయి. దాదాపు 14 రోజులుగా ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టాయి. అయితే ఈరోజు సంచార జాతులు నిర్ధారించడంతో రంగంలోకి దిగి సైన్యం హతమార్చింది. హషీం ముసా అలియస్ సులేమాన్ మూసా పాకిస్తాన్ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ లో మాజీ పారా కమాండ్. సైన్యంలో ఉన్నప్పుడు కీలకమైన పదవి నుంచి తొలగింపబడ్డాడు.