Pahalgam: మిని స్విట్జర్లాండ్స్‌లో ఈ ప్రదేశాలు లైఫ్‌లో ఒక్కసారైనా చూడాల్సిందే

Pahalgam: ఈ ప్రపంచం ఎన్నో ప్రకృతి అందాలకు నిలయం. ఎన్నో అందమైన ప్రదేశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. వీటిని చూడాలని చాలా మంది ఎంతో తపన పడుతుంటారు. అయితే చాలా మందికి మంచు కొండలకు వెళ్లాలంటే ఇష్టం. ఎంత చలి ఉన్నా కూడా ఆ ఎక్స్‌పీరియన్స్ చేయాలని అనుకుంటారు. అయితే స్విట్జర్లాండ్ వెళ్లాలని చాలా మంది భావిస్తారు. ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఎంతగానో ప్లాన్ చేస్తుంటారు. నిజం చెప్పాలంటే ఎన్నో రోజులు కష్టపడి సంపాదించిన డబ్బులను సేవ్ చేసి, సమయం పెట్టుకుని మరి స్విట్జర్లాండ్ వెళ్లాలని అనుకుంటారు. కానీ వీసా అన్ని కూడా కుదరకపోవడంతో.. చాలా మంది మన దేశంలో ఉన్న మినీ స్వి్ట్జర్లాండ్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ లోయ, పచ్చని చెట్లు, కొండలు ఎంతో అందంగా ఉంటాయి. టూరిస్ట్‌లను ఈ మినీ స్విట్జర్లాండ్ ఎంతోగానో ఆకర్షిస్తుంది. అయితే ఈ మినీ స్వి్ట్జర్లాండ్ దేశంలో ఎక్కడ ఉంది? ఎలా వెళ్లాలి? ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
దేశంలోనే అందమైన ప్రదేశాల్లో జమ్మూ కశ్మీర్ ఒకటి. ఇక్కడికి వెళ్లాలని చాలా మంది ఎన్నో ఏళ్ల నుంచి ఆశలు పెటుకుంటారు. దీనికోసం డబ్బును దాచి పెట్టి మరి ప్లాన్ చేసుకుంటారు. అయితే జమ్మూకశ్మీర్‌లో అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గామ్ ప్రాంతంలోని బైసరన్ లోయకు ఎక్కువగా యాత్రికులు వెళ్తుంటారు. స్వి్ట్జర్లాండ్ వెళ్లలేని వారు చాలా మంది ఇక్కడిక వెళ్తుంటారు. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. ఎక్కువగా హనీమూన్‌కి వెళ్లేవారు ఈ ప్లేస్‌ను ఎంచుకుంటారు. ఈ బైసరన్ లోయలో ఎక్కువగా పచ్చదనం ఉంటుంది. సీజనల్ బట్టి మారుతుంది. అందమైన పచ్చిక బయళ్లు, మేఘాలతో ఉన్న కొండలు ఇలా చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు. ఈ లోయకు వెళ్లాలంటే నడకదారిన వెళ్లాలి. లేకపోతే గుర్రాలతో వెళ్లాలి. ఈ లోయలో ఎక్కువగా పచ్చిక మైదానాలు, పైన్స్ చెట్లు ఉంటాయి. అయితే ఎవరైనా చూస్తే మాత్రం నిజంగా స్విట్జర్లాండ్‌లో ఉన్నట్లే ఉంటుంది. ఇందులో అల్పైన్ మైదానాలు చాలా ప్రత్యేకమైనవి. ఈ కొండల మధ్య నడుస్తుంటే మాత్రం తప్పకుండా ఎంతో స్వర్గంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడి ప్రకృతి అందాలు అంత మనోహరంగా ఉంటాయి. బైసరన్ లోయను వీక్షించేందుకు సరైన సమయం ఏప్రిల్ నుంచి జూన్. ఎక్కువ మంది పర్యాటకులు ఈ నెలల్లోనే ఇక్కడికి వెళ్తారు.
ఈ బైసరన్ లోయలో ఎక్కువ మంది ట్రెక్కింగ్ చేయడానికి వెళ్తుంటారు. ఈ లోయలో ఎక్కువగా సినిమాలు తీస్తుంటారు. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు ఈ లోయలో తీస్తారు. స్విట్జర్లాండ్ వెళ్లి షూటింగ్ చేయలేని వారు, బడ్జెట్ తక్కువగా ఉన్నవారు ఈ బైసరన్ లోయలో షూటింగ్ చేస్తారు. ఈ బైసరన్ లోయకు వెళ్లాలంటే.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో దిగాలి. అక్కడి నుంచి దాదాపుగా 90 కిలోమీటర్ల దూరంలో ఈ బైసరన్ లోయ ఉంటుంది. అయితే ఇక్కడికి డైరెక్ట్‌గా వాహనాలు ఉండవు. పహల్గామ్ వరకు బస్సులు, క్యాబ్‌లో వెళ్లి.. అక్కడి నుంచి నడుచుకుంటూ లేదా హార్స్ రైడ్ చేసుకుంటూ బైసరన్ వెళ్లాలి.